Kajal taking Long Break and not signing any Films : కాజల్ సినిమా షూటింగ్స్ కి పూర్తి విరామం :-

Kajal taking Long Break and not signing any Films : ఈమధ్య కాజల్ అగర్వాల్ అసలు ఎక్కడ పెద్దగా కనిపించడం లేదు. మనందరికీ తెలిసిందే లాక్ డౌన్ సమయం లో కాజల్ తన క్లాస్ మేట్ ని వివాదమాడిందని. పెళ్ళైన తర్వాత కాజల్ ఇప్పటివరకు పెద్దగా ఏ సినిమాకు సైన్ చేయలేదని తెలుస్తుంది. కాజల్ చివరిగా సైన్ చేసిన సినిమా మెగా స్టార్ చిరంజీవి ఆచార్య. ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకొని రిలీజ్ కి సిద్ధంగా ఉంది.
అయితే పెళ్ళైన తర్వాత కూడా కాజల్ ఆచార్య సినిమాలోని ప్యాచ్ వర్క్స్ పూర్తి చేసుకొని సినిమాలకి కంప్లేటేగా విరామం ఇచ్చింది. దీని తర్వాత వేరే సినిమా ఆఫర్లు వస్తున్నా కాజల్ సైన్ చెయడం లేదు అని తెలుస్తుంది.
మ్యాటర్లోకి వెళ్తే కాజల్ ప్రస్తుతం గర్భవతి అని. త్వరలో ఒక బిడ్డకి తల్లికాబోతుందని చిత్ర సీమ లో టాక్ నడుస్తుంది. అయితే ప్రస్తుతం కాజల్ ఏ సినిమా ఆఫర్ అంగీకరించకపివడంతో ఈ వార్తే నిజం అని తెలుస్తుంది.
పోతే నాగార్జున ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ఘోస్ట్ లో ముందుగా కాజల్ ని అనుకున్నారు కానీ కాజల్ ఒప్పుకోకపోవడంతో కాజల్ ని రీప్లేస్ చేసే హీరోయిన్ ని వెతికే పనిలో ఉన్నారని తెలుస్తుంది.
ఇలా వచ్చిన సినిమా ఆఫర్లని వదులుకొని కాజల్ భర్తతోను , కుటుంబ సభ్యులతో టైం స్పెండ్ చేస్తున్నారంటే కారణం కాజల్ తల్లి కాబోతుందనే తెలుస్తుంది. చూడాలి మరి దీని పైన కాజల్ ఎలా స్పందిస్తుందో మరియు అధికారికంగా ఎపుడు ప్రకటిస్తారో.