Tollywood news in telugu

పారాణి ఆరక ముందే షూటింగ్ లో పాల్గునంటున్న కాజల్ ఎందుకో తెలుసా ?

kajal agarwal: నటి కాజల్ అగర్వాల్ ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కింది. ఇటీవలే అక్టోబర్ 30న ముంబైలోని తాజ్ హోటల్ లో తన బాయ్ ఫ్రెండ్ గౌతమ్ ని వివాహం చేసుకున్న విషయం అందరికి తెలిసిందే… పెళ్లయి పదిహేను రోజులైనా కాకముందే… కాజల్ అగర్వాల్ సినిమా షూటింగ్ లో పాల్గొన బోతున్నట్లు ప్రకటించింది.

ఈ ఒక్క విషయం చాలు కాజల్ కి తన పని పట్ల ఎంతో నిబద్ధత ఉందో అన్ని చెప్పడానికి… కాజల్ తన పెళ్లి కాకముందు ఇచ్చిన కమిట్మెంట్లను పెళ్లి సాకు చెప్పి గాలికి వదిలేయకుండా… నిర్మాతలు నష్టపోకూడదనే ఉద్దేశంతో షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. ఈనెల 10న తమిళంలోని “హే సినామికా” చిత్రంలో హీరో దుల్కర్‌ సల్మాన్ కు జోడిగా కాజల్ అగర్వాల్ నటించబోతున్నారు. కాజల్ తన కాళ్ళ పారాణి ఆరకముందే… చిత్ర షూటింగ్లో పాల్గొనడం పట్ల పలువురు నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు…

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button