Viral news in telugu

Kadaknath Chicken: కాసులు కురిపిస్తున్న ‘కడక్నాథ్ చికెన్’ …!

Kadaknath Chicken

Kadaknath Chicken:  నాటుకోడి పేరు వింటే చాలు….నోట్లో నీళ్లు ఊరడం కాయం. అంతగా ఇష్టపడుతూ ఉంటారు ప్రజలు. ఫారం కోళ్లతో పోల్చితే, ఊరి కోడి కి డిమాండ్ ఎక్కువే, ఎందుకంటే ప్రశాంతమైన వాతావరణంలో ఆరోగ్యాంగా పెరగడం, ఎలాంటి మందులు, ఇంజక్షన్లు ఇవ్వకపోవడం తో  నాచురల్  నాటుకోడిని తింటే మన ఆరోగ్యం కూడా బాగుంటుందని ప్రజలు విశ్వసిస్తారు.

ఇపుడు ఈ నాటికోడి కి పోటీగా మరో కోడి వచ్చేసింది. దానిపేరు ‘కడక్ నాథ్’  ఈ కోడి మాంసానికి డిమాండ్ అంతా ఇంతా కాదు ఏకంగా మేక మాంసానికి ఉండే డిమాండ్ ని దాటిపోయింది. ఇపుడు అంతలా ప్రాచుర్యం పొందుతుంది  నల్లజాతి కోడి. ఈ కోడి మాంసం కిలో వెయ్యి నుంచి 12వందల వరకు పలుకుతుంది. ఏంటి దీని స్పెషాలిటీ అని ఆలోచిస్తున్నారా… ఈ కోడి రూపం దగ్గర్నుంచి అన్నీ స్పెషలే,  కడక్‌నాథ్ కోడి మాంసం నల్లటి రంగులో ఉంటుంది. కోడి కూడా ఇదే రంగులో ఉంటుంది. అయితే కడక్‌నాథ్ చికెన్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో  క్రొవ్వు పదార్థంల శాతం తక్కువగా  ఉంటుంది. అలాగే మంచి రుచిని కూడా కలిగి ఉంటుంది. ఇన్ని రకాల ప్రయోజనాలు  ఉండటంతో కడక్‌నాథ్ చికెన్‌ ధర భారీగా పలుకుతోంది. లైవ్  కోడి కిలో కి 800వరకు ఉండగా,  చికెన్‌ కిలో 1000 నుంచి రూ 1200 వరకు ఉంది.

మరి ఈ కోడి పుట్టుపూర్వోత్తరాలు చూస్తే…. కడక్‌నాథ్ బ్రీడ్ ఛత్తీస్‌గఢ్, గుజరాత్, మధ్యప్రదేశ్,  రాజస్థాన్‌లలోని  లభ్యమైంది. అప్పట్లో ఈ కోడి గురించి కొన్ని అవాస్తవాలు కూడా నెట్టింట్లో చెక్కర్లు కొట్టాయి . అదేంటంటే ఈ కోడి గుడ్డు  నలుపురంగులోనే ఉంటుంది అని , నిజానికి  అవి కాస్త కాఫీరంగుతో పాటు , పింక్ కలర్‌లో ఉంటాయి.

అలాగే టీమిండియా మాజీ క్రికెట్ ధోనీ కడక్‌నాథ్ కోళ్లు బిజినెస్ ప్రారంభిస్తున్నాడు అనే వార్త తో  కడక్‌నాథ్ చికెన్‌కు బాగా ప్రాచూర్యం లభించింది. ధోని ఏంటి కోళ్లను పెంచడం ఏంటి, అసలు ఈ నల్లజాతి కోడికి ఇంత డిమాండ్ ఎందుకుంది తెలుసుకుందామని , ప్రజలు ఇంటర్నెట్‌లో తెగ సెర్చ్ చేసారు. ఇంకెందుకు లేటు మీరు  కూడా మంచి సందర్భం చూసి లాగించేసేయండి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button