KA Paul Oppenheimer Review : నా జీవితంలో మళ్ళీ సినిమాలు చూడను
KA Paul Oppenheimer Review :క్రిస్టోఫర్ నోలన్.. ఈ డైరెక్టర్ గురించి హాలీవుడ్ మూవీ లవర్స్ కి కొత్తగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. ఆయన సినిమా కోసం కొన్ని ఏండ్లపాటు వేచి చూస్తూ ఉంటారు. క్రిస్టోఫర్ నోలన్ సినిమాలో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ గా మారుతూ ఉంటాయి. ఇటీవలే విడుదలైన ఆయన తెరకెక్కించిన ఓపెన్‌హైమర్ సినిమా థియేటర్లో దుమ్ము దులుపుతుంది. ఈ సినిమా ఒక ఆటమిక్ బాంబ్ సైంటిస్ట్ బయోపిక్.1942 లో జరిగిన నిజ జీవిత సంఘటలనను ఆధారంగా నోలన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. క్రిస్టఫర్ నోలన్ తన ప్రతి సినిమాని వైవిధ్యంగా తీస్తూ ఉంటాడు. ఈ నేపథ్యంలో ఓపెన్‌హైమర్ లో న్యూక్లియర్ ప్రాజెక్ట్ వెనుక జరిగిన చీకటి కోణాన్ని అందరికీ క్రిస్టల్ క్లియర్ గా చూపెట్టాడు. ఇక సినిమాలో ఉన్న విజువల్స్ ని గురించి చెప్పాలంటే మాటలు సరిపోవు.

ఇదిలా ఉంటే ఓపెన్‌హైమర్ పై కె.పాల్ సినిమా చూసి స్పందించాడు. తన జీవితంలో తాను అఫీషియల్ గా చూసిన మొట్టమొదటి చిత్రం ఇదేనన్ని… తాను ఇప్పటివరకు ఆ రెండు గంటలు కూడా కూర్చుని ఏ సినిమా చూడలేదని.. కానీ ఈ సినిమా ఎందుకు చూడాల్సి వచ్చిందో కె.పాల్ తెలిపారు. మణిపూర్ లో మహిళలపై రేప్ లు జరుగుతున్న ప్రభుత్వం స్పందించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం కేఏ పాల్ కి సంబంధించిన ఆ వీడియో బాయిట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.