Tollywood news in telugu

జస్ట్….ఈ మూవీస్ చూస్తే చాలు.. మీరు రూ.70 వేలు సంపాదిస్తారు…. ఎలాగంటే…!

james bond movies

james bond movies : మనం వారమంతా పనిచేసి కొంచం రిలాక్స కావడానికి డబ్బులు ఖర్చుచేసి మరి సినిమాలకు వెళ్తూ  ఉంటాం. కానీ ఇక్కడ ఒక సంస్థ సినిమాలు చుస్తే తిరిగి మనకే డబ్బులు చెల్లిస్తుంది. వివరాల్లోకి వెళ్తే… జేమ్స్ బాండ్ సినిమాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రజలను ఎలా ఆకర్షిస్తాయో  ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. జేమ్స్ బాండ్ సినిమా సిరీస్ కోసం జనాలు ఎదురు చూస్తూ  ఉంటారు కూడా..  అయితే ‘జేమ్స్ బాండ్’ సినిమా మొదటి పార్టు నుంచి ఇప్పటివరకు విడుదలైన 24 సినిమాలు చూస్తే.. మీకు వేలల్లో డబ్బు ముట్టచెప్తున్నారు.

ఈ క్రేజీ ఆఫర్ NerdBear.com అనే వెబ్‌సైట్  ప్రకటించింది. 1962 నాటి ‘Dr.No ‘ నుండి 2015లో విడుదలైన  ‘Spectre’ మూవీ వరకు 24 సినిమాలను కచ్చితంగా చూడాలి. ఎందుకంటే ఈ సంవత్సరం  సెప్టెంబరు 30న జేమ్స్ బాండ్ సీరిస్‌లో 25వ సినిమా  ‘No Time to Die’ విడుదల కాబోతుంది.

మరి ఈ జేమ్స్ బాండ్ సీరిస్‌లను వీక్షించేటందుకు సెలెక్ట్ అయ్యేవారు  25వ వెర్షన్ విడుదలకు ముందే ఆ 24 చిత్రాలు చూడాల్సి ఉంటుంది.  ఇలా చుసిన వారికీ  నిర్వాహకులు1000 డాలర్లు అంటే సుమారుగా  రూ.70 వేయిల పైనే చెల్లిస్తుంది . 

అదేవిదంగా జేమ్స్ బాండ్ సినిమాలు ఇష్టపడేవారికి ఇది ఒక సింపుల్ టాస్క్ అనే చెప్పవచ్చు. మీరు కూడా  ఆలస్యం చేయకుండా .. వెంటనే దరఖాస్తు చేసేయండి.

ఇంకొక ట్విస్ట్ ఏంటంటే దీనికి ఎంపికయ్యే వారు  30 రోజుల్లోనే 24 సినిమాలను చూడాల్సి ఉంటుంది. ఈ సినిమాలన్నీ కలిపితే మొత్తం సమయం  51 గంటల వరకు ఉంది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button