తమిళ్ రీమేక్ మూవీకి జూనియర్ శ్రీదేవి సై… !

టాలీవుడ్ అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ‘ధఢక్’ సినిమాతో బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇలా మొదటి రెండు సినిమాలతోనే శ్రీదేవికి సరైన వారసురాలు అనే ప్రశంసలు జాన్వీ కపూర్ అందుకుంది. దీని తరవాత ‘గుంజన్ సక్సేనా’ తో బయోపిక్ కథని ఒకే చెప్పి మరోసారి తనని తానూ నిరూపించుకుంది.
ప్రస్తుతం కరణ్ జోనర్ దర్శకత్వంలో బ్రహ్మాస్త్ర సినిమాతో పాటు మరో భారీ బడ్జెట్ చిత్రంలో కూడా జాన్వీ కపూర్ నటిస్తుంది. దీనితో పాటు ఇప్పుడు ఓ తమిళ్ మూవీ రీమేక్ కి జూనియర్ శ్రీదేవి సై అందట.
తమిళంలో లేడీ సూపర్ స్టార్ నయనతార లీడ్ లో నటించిన క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘కొలమావు కోకిల’ సినిమా సూపర్ హిట్ కావడంతో , ఇపుడు ఈ సినిమాని హిందీలో ఆనంద్ ఎల్ రాయ్ రీమేక్ చేస్తున్నారు.ఈ సినిమాకి సిద్ధార్థ్ సేన్ గుప్తా దర్శకత్వం వహిస్తున్నాడు.
ఈ సినిమాలో కథానాయికగా జాన్వీ కపూర్ నటించనున్నారు. కొత్త సంవత్సరం జనవరి 9 నుంచి పంజాబ్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతుంది.