Junior NTR Historical Bollywood Entry Fix : జూనియర్ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఫిక్స్ ?:-

Junior NTR Historical Bollywood Entry Fix : ఇపుడు ఇండస్ట్రీ లో ఎటు చుసిన ఎక్కడ విన్న ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు సర్వం సిద్ధం అయిందనే వార్తలు విపరీతంగా వినిపిస్తున్నాయి.
అయితే ప్రస్తుతం ఇండస్ట్రీ లో వినిపిస్తున్న వార్త ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ గారు కచ్చితంగా బాలీవుడ్ లో సినిమా చేయబోతున్నట్లు , ఆ సినిమాని హిస్టారికల్ సినిమాలకి కేర్ అఫ్ అడ్రెస్స్ అయినా సంజయ్ లీల భన్సాలీ గారి దర్శకత్వం లో ఉండబోతుందని వార్తలు ఓ రేంజ్ లో విపిస్తున్నాయి.
సంజయ్ లీల భన్సాలీ సినిమాలకు వీరాభిమానులు ఎందరో ముఖ్యంగా బాజీరావు మస్తానీ , దేవదాస్ , పద్మావతి . ఇలా చారిత్రాత్మక సినిమాలు తియ్యడం లో దిట్ట. అలాంటి సంజయ్ లీల భన్సాలీ గారు ఇటీవలే ఎన్టీఆర్ ని కలిసి కథ చెప్పినట్లు అది కూడా హిస్టారికల్ సినిమా అని విశేష వర్గాలు చెబుతున్నాయి.
అయితే ఈ కాంబినేషన్ లో వచ్చే సినిమా పేరు కూడా ఫిక్స్ అయ్యారని తెలుస్తుంది. జూనియర్ ఎన్టీఆర్ మరియు సంజయ్ లీల కలిసి చేయబోయే హిస్టారికల్ సినిమా టైటిల్ గా జై భవ్ రే అని వర్కింగ్ టైటిల్ గా పెట్టినట్లు తెలుస్తోంది. సంజయ్ లీల కథ చెప్పగానే ఎన్టీఆర్ కి ఎంతగానో నచ్చేసి వెంటనే ఓకే చెప్పారని తెలుస్తుంది.
ఈ సినిమా ద్వారా ఎన్టీఆర్ బాలీవుడ్ లో గ్రాండ్ ఇయ్యబోతున్నారు. త్వరలో దీనిపై మరిన్ని సమాచారాలు అధికారికంగా వెల్లడించబోతున్నారు. చూడలి మరి ఇండస్ట్రీ అంత హుల్ చల్ చేసే ఈ ఎన్టీఆర్ మరియు సంజయ్ లీల భన్సాలీ కాంబినేషన్ లో సినిమా నిజమో కాదో త్వరలో తెలుస్తుంది.
అధికారిక ప్రకటన వచ్చేదాకా కన్ఫర్మేషన్ చేయలేము కాకపోతే ఇండస్ట్రీ లో ఇదే హాట్ టాపిక్ గా మారింది. వేచి చూడాలి ఎం జరగబోతుందో.