Tollywood news in telugu

Juicy Update on RRR teaser : అర్. ఆర్. ఆర్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ :-

Juicy Update on RRR teaser

Juicy Update on RRR teaser : దేశవ్యాప్తంగా ప్రజలు ముఖ్యంగా అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణం రానే వచ్చేసింది. అదేనండి యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రాంచరణ్ కలిసి జక్కన దర్శకత్వం లో చేసిన ప్యాన్ ఇండియా సినిమా ఆర్.ఆర్.ఆర్.

అయితే ఈ సినిమా ఎన్నో కష్టాలు ఎదుర్కొని , వాయిదాల మీద వాయిదాలు చేసుకుంటూ చివరికి జనవరి 7 న దేశవ్యాప్తంగా విడుదలకు సిద్ధం చేసిన విషయం మనందరికీ తెలిసిందే.

అయితే ఇక్కడ విచిత్రం ఏంటంటే జక్కన అనుకున్న టైం కి ఏది రిలీజ్ చెయ్యడని మరల ప్రూవ్ చేసాడు. అక్టోబర్ 29 న ఆర్.ఆర్.ఆర్ సినిమాకి సంబందించిన టీజర్ విడుదల చేస్తాం అని చెప్పిన బృందం , టీజర్ కాకుండా సినిమా ఏ సంస్థతో జత కట్టి విడుదల చేయబోతుంది అనే మాత్రం అధికారికంగా ప్రకటించి టీజర్ విషయం మరిచిపోయారు.

పి.వి.ఆర్. సంస్థతో ఆర్.ఆర్.ఆర్ బృందం అధికారికంగా టై అప్ అయింది. అయితే అభిమానులు మాత్రం ఏ హాలీవుడ్ సంస్థతో టై అప్ ఉంటుందని ఊహించి , ఈ వార్త వినగానే నిరాశ చెందారు. ఇంకోపక్క అనుకున్నట్లు టీజర్ కూడా రిలీజ్ చేయలేదు అని రెట్టింపు బాధకు గురయ్యారు చిత్రబృందం.

కాగా మొత్తానికి ఈరోజు ఆర్.ఆర్.ఆర్ టీజర్ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు చిత్రబృందం. మొత్తానికి ఆర్.ఆర్.ఆర్ టీజర్ నవంబర్ 1 న ఉదయం 11 గంటలకు విడుదల చేయబోతున్నట్లు చెప్పారు.

ఈ టీజర్ నిడివి 45 సెకండ్లు ఉండబోతుందని , టీజర్ లో ఒక డైలాగ్ కూడా ఉండదని , ఓన్లీ విజువల్ ట్రీట్ అని చిత్రసీమ లో విపరీతంగా టాక్ నడుస్తుంది. చూడాలి మరి నవంబర్ 1 న ఆర్.ఆర్.ఆర్. సృష్టించే విజృంభణ ఏ రేంజ్ లో ఉండబోతుందో.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button