Tollywood news in telugu

Jr.Ntr: ఏపీకి కాబోయే సీఎం జూనియర్ ఎన్టీఆర్?

Jr.NTR/Instagram

ఈ వార్త విన్న వారు.. జూనియర్ ఎన్టీఆర్ సీఎం ఏంటి? ఆయన ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు కదా అని కొందరు ఆశ్చర్యపోతుంటారు. ఆంధ్రాలో ఎప్పుడు టిడిపి కార్యకర్తలు, నందమూరి అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ సీఎం కావాలన్న కోరికను వ్యక్త పరచడానికి ఏదో ఒకటి చేసి వార్తల్లోకి వస్తూ ఉంటారు.

Jr.NTR/Instagram

అలాగే తాజాగా ఇప్పుడు ఒక సంఘటన ద్వారా వార్తల్లో నిలిచారు. ఏపీలోని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో టీడీపీ కార్యకర్తలు రాబోయే నూతన సంవత్సర శుభాకాంక్షలతో కూడిన ఫ్లెక్సీను ఏర్పాటు చేశారు.ఈ ఫ్లెక్సీ అందరి దృష్టిని ఆకర్షించింది. ఆ ఫ్లెక్సీలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటో తో పాటు కాబోయే సీఎం అని పెద్ద అక్షరాలతో ఉంది. ఇప్పుడు ఈ ఫ్లెక్స్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button