Nidhi Razdan: ఒక్క మెయిల్ తో ప్రముఖ న్యూస్ ఛానల్ లో ఉద్యోగన్ని పోగొట్టుకున్న జర్నలిస్ట్..ఎలా అంటే?

Nidhi Razdan: ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ నిధి రాజ్దాన్ ఫిషింగ్ మెయిల్ తో మోసపోయింది. హావార్డు యూనివర్సిటీ లో ప్రొఫెసర్గా ఉద్యోగం వచ్చింది అంటూ మెయిల్ రావడంతో.. దాని నిధి నమ్మి ఉద్యోగానికి రాజీనామా చేసింది… తీరా చూస్తే ఆ మెయిల్ ఫేక్ అన్ని తేలింది

గత 22 సంవత్సరాలుగా ఎన్డిటీవీ లో పనిచేస్తున్న నిధి రాజ్దాన్ కి జూన్ 2020లో హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో జర్నలిజం అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం వచ్చిందంటూ ఒక మెయిల్ నిధికి వచ్చింది. ఈ మెయిల్ లో సెప్టెంబర్ 2020 లోపు విధుల్లో చేరాలని ఉండడంతో…ఎన్డిటీవీ జర్నలిస్టుగా నిధి రెసిన్ చేసింది.

కొద్ది రోజులుగా వేచి చూస్తున్న హావార్డు యూనివర్సిటీ పిలుపు ఇంకా రాకపోవడంతో హావార్డు1 లో పనిచేస్తున్న సీనియర్ ప్రొఫెసర్ వాళ్లకు ఫోన్ చేసి విషయన్ని ఆరా తీసింది. తనకు వచ్చిన సదరు మెయిల్ ఫేక్ అన్ని నిధి గ్రహించడంతో..సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది