Tollywood news in telugu
జనసేనలో సభ్యత్వం తీసుకుంటే రూ.500…మరి బెనిఫిట్స్ అదే రేంజ్ లో ఉన్నాయ్ !

గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో 5 నియోజకవర్గాలకు సంబందించిన నేతలతో సమావేశమై జనసేనా పార్టీ భవిష్యత్తు కార్యాచరణపై నేతలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు.
పార్టీ కార్యకర్తలకు అండగా ఉండే విదంగా క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమం చేపట్టినట్లు పవన్ మీడియాముందు వెల్లడించారు.
ఈ సభ్యత్వం విషయంలో దివంగత కాన్షీరామ్, దళిత ఉద్యమాలను స్ఫూర్తిగా తీసుకొని కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపాడు.
జనసేన రాజకీయ వ్యవహరాల చైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, జనసేన పార్టీలో ఇక మీదట సభ్యత్వం తీసుకోవాలంటే రూ. 500 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నాడు.
ఇలా సభ్యత్వం తీసుకున్నవారికి రాబోయేరోజుల్లో పార్టీ తరపున శిక్షణనివ్వడం జరుగుతుందని, అదేవిదంగా ఐదు లక్షల ప్రమాదబీమా పొందవచ్చని తెలిపారు.