JoeBiden | కరోనా వ్యాక్సిన్ ని వేసుకున్న అమెరికా అధ్యక్షుడు

అగ్ర దేశమైన అమెరికాలో కరోనా రోజురోజుకీ విస్తరిస్తుంది… ఇప్పటికే కరోనా మహమ్మారి తో సుమారు మూడు లక్షల 20 వేల మంది మృత్యువాత పడ్డారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని అమెరికాలో శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ తేవడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు ఫైజర్ వ్యాక్సిన్ ను అమెరికా ప్రభుత్వం ఆమోదించి.. ప్రజలకు టీకా అందించే కార్యక్రమన్ని ఇటీవలే ప్రారంభించింది.

దీంతో అమెరికా నూతన అధ్యక్షుడు జో బిడెన్(78) డెలవర్ లోని క్రిస్టియానా ఆస్పత్రిలో సోమవారం ఫైజర్ వ్యాక్సిన్ తీసుకున్నారు. దాని కన్న ముందు రోజు తన భార్య జిల్ బైడెన్ కూడా కరోనా టీకా తీసుకున్నారు. ఈ సందర్భంగా జో బిడెన్ ఆయన మాట్లాడుతూ… అమెరికా ప్రజలు ఎలాంటి అపోహలు నమ్మకూడదని వ్యాక్సిన్ తీసుకున్నట్లు తెలిపారు. ఈ వ్యాక్సిన్ ద్వారా కరోనా వైరస్ ను అరికట్టే అవకాశాలు ఉన్నాయన్నారు. అందుకే ప్రజలు ప్రతి ఒక్కరూ కరోనా టీకా తీసుకోవాలని కోరారు.
