News

జో బైడెన్ ఘనవిజయం… సంతోషంలో అమెరికన్లు !

joe biden

అమెరికాలో ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన అధ్యక్ష ఎన్నికల రిజల్ట్స్ లో జో బైడెన్ ఘనవిజయం సాధించి అధ్యక్ష పదవిని చేపట్టనున్నారు.  కౌంటింగ్ ప్ర‌క్రియ‌లో భాగంగా  పెన్సిల్వేనియా రాష్ట్ర ఫ‌లితాల‌పై స్ప‌ష్ట‌త రావ‌డంతో బైడెన్ విజ‌యం ఖ‌రారు అయినట్టే.

అమెరికా అధ్యక్ష పీఠం అధిష్టించడానికి 270 ఎలక్టోరల్ ఓట్లు కావాల్సి ఉండగా  బైడెన్ అంతకంటే 20 ఓట్లు ఎక్కువే సాధించారు. బిడెన్ ప్రత్యర్థి డోనాల్డ్ ట్రాంప్ ఇప్పటివరకు 214 ఓట్లకే పరిమితమయ్యారు. ఇంకా పూర్తీ ఫలితాలు రావాల్సి ఉన్నా దాదాపుగా బైడెన్ విజయం ఖరారైంది.

ఇపుడు జో బిడెన్ అమెరికాకు 46 వ అధ్యక్షుడు అవుతున్నాడు. ఉపాధ్య‌క్షురాలిగా క‌మ‌లా హారిస్ కూడా విజ‌యం పతాకం ఎగురవేసినట్టే.

గత కొన్నేళ్ల‌లో బిల్ క్లింట‌న్, జార్జ్ డ‌బ్ల్యూ బుష్, ఒబామా వంటి అధ్య‌క్షులు వ‌ర‌స‌గా రెండు  ట‌ర్మ్ ల‌లోనూ విజ‌యాలు అందుకున్నారు. కానీ వీరి స్థానాలలో ట్రాంప్ వచ్చే అవకాశాలు కనపడుటలేవనే చెప్పాలి. 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button