News

Job Mela In Hyderbad : ఈ రోజు హైదరాబాద్ లో జాబ్ మేళా… 2 వేయిల ఖాళీలు..!

Job Mela In Hyderbad

Job Mela In Hyderbad : వృత్తి పరంగానే కాకుండా బాధ్యతగా హైదరాబాద్‌ పోలీసులు సమాజసేవ చేయడానికి ముందు ఉంటున్నారు. అటు  శాంతిభ్రదతల పరిరక్షణలో విధులు నిర్వహిస్తూనే మరోవైపు సమాజసేవ కోసం కృషి చేస్తున్నారు    ఇందులో  ప్రజల్లో ట్రాఫిక్‌పై, సైబర్‌ నేరాలపై అవగాహన  కార్యక్రమాలు చేస్తూనే..   రక్తదాన శిబిరాలు చేపడుతున్నారు. ఇక ఈ రోజు (శనివారం) తాజాగా హైదరాబాద్‌ పోలీసులు జాబ్‌ మేళా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.

 మల్లెపల్లిలో  అమ్‌వర్లుల్‌ ఉలుమ్‌ కాలేజీ లో ఈ జాబ్ మేళాను  హబీబ్‌ నగర్‌ పోలీసులు నిర్వహిస్తున్నారు.  ఈ  మేళాలో 15  కంపెనీలు పాల్గొననున్నాయి. ఇందులో  సుమారు 2 వేయిల కు  పైగా ఖాళీలను భర్తీ చేయబోతున్నారు. ఇక అర్హతల విషయానికి వస్తే…  పదో తరగతి నుంచి పీజీ వరకు అందరు ఇంటర్వ్యూలకు హాజరు కావచ్చని ప్రకటనలో తెలిపారు. జాబ్‌ మేళాకు వచ్చేవారు  రెజ్యుమే ప్రింట్ తీసుకొని రావాలని సూచించారు. 

ఇక ఈ మేళ ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరగనుంది. ఆదేవిందంగా  మేళాకు హాజరయ్యే వారు కచ్చితంగా కోవిడ్‌ నిబంధనలను పాటించాలని సూచించారు. పూర్తి వివరాలకు 9490157542 , 8333900131,  నంబర్లను ఫోన్ చేయాలనీ వెల్లడించారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button