JD chakravarthy : విష్ణుప్రియతో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన జెడి చక్రవర్తి
JD chakravarthy : జెడి చక్రవర్తి .. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరో.. తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇప్పటి జనరేషన్ వారికి ఈయన అంతగా తెలియకపోవచ్చు.. కానీ 90’s వారికి తెలిసి ఉంటుంది. శివ సినిమాతో పరిచయమైన ఈయన బొంబాయి ప్రియుడు, ప్రేమకు స్వాగతం వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో ప్రేక్షకులను అలరించాడు. ఇదిలా ఉంటే తాజాగా మళ్లీ జెడి చక్రవర్తి దయా అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 4న హాట్ స్టార్ లో విడుదల కాబోతుంది.

అయితే ఓ ఇంటర్వ్యూలో యాంకర్ విష్ణు ప్రియ తో పెళ్లి చేసుకోబోతున్నారటగా అని యాంకర్ అడగక విష్ణు ప్రియ ఒక మంచి హ్యూమన్ బీయింగ్ ఆమె నేను కలిసి ఒక వెబ్ సిరీస్ లో నటించాము ఆ వెబ్ సిరీస్ డైరెక్టర్ జెడి సినిమాలు రోజుకు ఒకటి చూడు ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటావు అని విష్ణు ప్రియకు సలహా ఇవ్వగా ఆమె రోజు నా చిత్రాలని చూసేది దీంతో ఆమె నా క్యారెక్టర్ కి పడిపోయింది అంతేగాని నన్ను లవ్ చేయడం లేదు ఆమెకు నాకు గురువు శిష్యు మధ్య ఉండే సంబంధమే ఉంది అంటూ జేడీ సమాధానం ఇచ్చారు