JD chakravarthy : ఆ డైరెక్టర్ కి అబద్ధాలు ఆడడం సరదా.. వయసు పెరిగే కొద్దీ మతిమరుపు పెరుగుతుంది
JD chakravarthy : జెడి చక్రవర్తి .. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన హీరో.. తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించి ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇప్పటి జనరేషన్ వారికి ఈయన అంతగా తెలియకపోవచ్చు.. కానీ 90’s వారికి తెలిసి ఉంటుంది. శివ సినిమాతో పరిచయమైన ఈయన బొంబాయి ప్రియుడు, ప్రేమకు స్వాగతం వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో ప్రేక్షకులను అలరించాడు. ఇదిలా ఉంటే తాజాగా మళ్లీ జెడి చక్రవర్తి దయా అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యాడు. ఈ వెబ్ సిరీస్ ఆగస్టు 4న హాట్ స్టార్ లో విడుదల కాబోతుంది.

ఈ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా జెడి చక్రవర్తి ప్రముఖ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో డైరెక్టర్ కృష్ణవంశీ, తేజల గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గులాబీ సినిమా చేస్తున్నప్పుడు తనకు కృష్ణవంశీకి మనస్పర్ధలు వచ్చాయి అని.. గులాబీ సక్సెస్ మీట్ లకు గాని మేము ఇద్దరు పాల్గొనలేదని.. దయ సినిమాతో మళ్ళీ మేమిద్దరం కలిసిపోయామని.. నేనెప్పుడూ గులాబీ సినిమాకు వాడికి థాంక్స్ చెప్పలేదని తెలిపారు. కృష్ణవంశీకి తనకి ఒక్క విషయంలో మాత్రమే మనస్పర్ధలు వచ్చాయన్నారు. అలాగే డైరెక్టర్ తేజ లేకుంటే తానులేనని.. ఆయన తనని రాంగోపాల్ వర్మ కి పరిచయం చేయడంతోనే తన కెరియర్ స్టార్ట్ అయిందన్నారు. తేజ కి వయసు పెరుగుతున్న కొద్దీ మతిమరుపు వచ్చినట్టుందని.. తన పెళ్లి నేనే చేశానని అప్పట్లో సితార మ్యాగజిన్ లో వెల్లడించి… ఇప్పుడేమో నేనేం చేయలేదని చెప్తున్నాడట. బహుశా తేజ కి అబద్ధాలు ఆడడం సరదా అయి ఉండవచ్చు అన్ని చక్రి ఘాటుగా స్పందించాడు.