Tollywood news in telugu

జయలలిత బయోపిక్ ట్రైలర్ విడుదల… తలైవి పాత్రలో ఇమిడిపోయిన కంగన రనౌత్ …!

Jayalalithaa biopic trailer released

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అలాగే నటి  జయలలిత  మనకు దూరమై 2 సంవత్సరాలు కావస్తుంది. అయినా కానీ ప్రజలు మాత్రం వారి మనసులో మాత్రం భద్రంగా పెట్టుకున్నారు. నిత్యం రోజులో  ఒక్కసారైనా జయ ను గుర్తుచేసుకుంటారు  తన అభిమానులు. జయలలిత తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయిన.. త్వరలో వెండితెరపై చూడనున్నారు . ఈ సందర్బంగా మాజీ ముఖ్యమంత్రి  జయలలిత పాత్ర‌కు ప్రాణం పోయ‌డానికి  ద‌ర్శ‌క నిర్మాత‌లు రెడీ అయ్యారు.

ఈ తరుణంలో   జ‌య‌ల‌లిత బ‌యోపిక్ తలైవి టీజర్ విడుదల చేసారు.దానికి మంచి స్పందన వచ్చింది.ఈ సినిమాలో . కంగన రనౌత్ ఇందులో అమ్మ పాత్రలో నటిస్తుంది. ద‌ర్శ‌కుడు ఏఎల్ విజ‌య్ ఈ బ‌యోపిక్ ను తెరకెక్కిస్తున్నాడు. ఇక్క‌డ  విశేషం ఏంటంటే ఎన్టీఆర్ బయోపిక్  నిర్మించిన విష్ణు ఇందూరి,  ఎన్టీఆర్ బ‌యోపిక్ దారుణంగా ముంచేసినా కూడా ఇప్పుడు మరోసారి ధైర్యంచేసి  త‌లైవి మూవీని  నిర్మిస్తున్నాడు.

ఈ సినిమా కోసం తొమ్మిది నెల‌లు స్క్రిప్ట్ సిద్ధం చేసాడు  రాజ‌మౌళి తండ్రి విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ , ఇందులో  జయలలిత జీవితంలో జరిగిన కొన్ని  ఎవరికీ ఇంతవరకు తెలియని ఆసక్తికరమైన విషయాల ను  చూపించబోతున్నాడు విజియేంద్రప్రసాద్. గతంలో జయలలిత కుటుంబసభ్యులు ఈ సినిమా విషయం పై అభ్యన్తరాలు తెలిపినా , ఇపుడు ఆ అడ్డంకికూడా తొలగింది. ఈ మూవీలో  ఎలాంటి వివాదాల లేకుండా నో అబ్జ‌క్ష‌న్ స‌ర్టిఫికెట్ కూడా తీసుకున్నారు. ఈ సినిమాకు విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ క‌థ ఇవ్వడంతో, సినిమాపై బారి అంచనాలు మొదలయ్యాయి. ఈ మూవీకి నిరవ్ షా సినిమాటోగ్రాఫర్‌గా చేయగా..  జీవీ ప్రకాశ్ సంగీతం సమకూర్చారు.

తమిళనాడు  లో వచ్చే నెలల్లో తమిళనాటా ఎలెక్షన్ ఉండటం , ఈ తరుణంలోనే జయలలిత బొయోపిక్  సినిమా   ట్రైలర్ విడుదల చేయడం కొంచం చర్చకు దారితీస్తుందో లేదో, చూడాలి. జయ చనిపోవడంతో అక్కడి రాజకీయాల్లో చాల మార్పులు వచ్చాయి. మరి ఈ ఎలక్షన్ ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడుతారో వేచి చూడాలి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button