Tollywood news in telugu
తన కుక్కను అవమానించారని సినిమా షూటింగ్ మధ్యలో వెళ్లిన హీరోయిన్ !

తమిళనాడు రాజకీయాల్లో మహారాణిగా వెలిగిన అలనాటి హీరోయిన్ జయలలిత తాను హీరోయిన్ గా ఉన్న సమయంలో ‘గూఢచారి 116’ షూటింగ్ చేస్తూ ఉండగా తన కుక్కకి అవమానం జరిగిందట.
ఆ సినిమా షూటింగ్ జరుగుతుండగా కుక్క మధ్యలోకి రావడంతో అక్కడి సినిమా యూనిట్ వాళ్ళు జయలలిత ఎంతో అపురూపంగా పెంచుకుంటున్న కుక్కని కొట్టారట, దానితో తన కుక్కని కొట్టారన్న కోపంతో షూటింగ్ మధ్యలోనే వెళ్లిపోయిందని ఆ సినిమాకి పనిచేసిన కొందరి ద్వారా ఈ విషయం బయటపడింది.