jathi ratnalu trailer : టెన్త్‌లో 60 %, ఇంటర్లో 50%, బీటెక్‌లో 40% ఎంట్రా ఈ మార్కులు అంటూ నాన్‌స్టాప్ నవ్వుల తో ‘జాతి రత్నాలు’ ట్రైలర్ రిలీజ్..

Jathi Ratnalu Trailer: మహానటి లాంటి హిట్ సినిమాను తెలకెక్కించిన చిత్ర నిర్మాత నాగ్ అశ్విన్ ఇపుడు ‘జాతిరత్నాలు ‘ అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నవీన్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ రామకృష్ణ ప్రధాన ప్రాతదారులుగా రూపొందుతుంది. ఈ సినిమా యొక్క ఫస్ట్ లుక్ తో చిత్రం పై బారి అంచనాలు పెరిగాయి.
తాజాగా చిత్ర యూనిట్ ఈ సినిమా టీజర్ హీరో ప్రభాస్ చేతులమీదుగా రిలీజ్ అయింది. 2 నిమిషాల నిడివి గల ఈ జాతిరత్నాలు ట్రైలర్ ఈ రోజు గురువారం విడుదల అయింది. ‘టెన్త్‌లో 60 శాతం, ఇంటర్లో 50 శాతం, బీటెక్‌లో 40 శాతం ఎంట్రా ఈ మార్కులు అన్న ప్రశ్నకు.. నవీన్ పొలిశెట్టి స్పందిస్తూ.. అందుకే ఎంటెక్ చేయలేదు అన్న’ అని నవ్వులు పూయించే సమాధానంతో ట్రైలర్ మొదలైంది.
అలాగే ఈ సినిమా మర్చి 11 న విడుదలకు రెడీ గా ఉంది. ఇక ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో తెలియాలంటే సినిమా విడుదల వరకు వెయిట్ చేయాల్సిందే.