jathi ratnalu telugu movie- జాతి రత్నాలు
jathi ratnalu telugu movie : ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అనే చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో నవీన్ పొలిశెట్టి ప్రధాన పాత్రలో నటిస్తున్న జాతి రత్నాలు చిత్రం నేడు వరల్డ్ వైడ్ రిలీజ్ అయింది. నవీన్ పొలిశెట్టి అంటే కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉండటంతో ఈ జాతి రత్నం సినిమా ఎలా ఉండబోతుంది? జాతి రత్నాలు కామెడీ రత్నాలా? సినిమా చూడొచ్చా? సినిమా హిట్టా పట్టా అనేది తెలుసుకుందాం…
జాతి రత్నాలు చిత్రంలో నవీన్ తో పాటు కమెడియన్లు ప్రియదర్శి, రాహుల్ ప్రధాన పాత్రలో నటించారు. అదే విధంగా ఈ చిత్రంలో ఫారియా అనే కొత్త నటి హీరోయిన్ గా నటించింది .ఈ చిత్రాన్నికి అనుదీప్ కె.వి దర్శకత్వం వహించాగా.. నిర్మాతగా మహానటి డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్వప్న సినిమాస్ బ్యానర్ పై నిర్మించారు.

ఇక సినిమా విషయానికి వస్తే…జాతిరత్నాలు ఫస్ట్ హాఫ్ పిచ్చ కామెడీ గా ఉంది. అదేవిధంగా సెకండ్ హాఫ్ కూడా బాగానే ఉంది.. కానీ ఫస్ట్ హాఫ్ లో ఉన్నంత కామెడీ లేదు. సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది. ఇంక మిగతాదంతా ఒకే… ముఖ్యంగా నవీన్ పొలిశెట్టి యాక్టింగ్ సూపర్..ప్రియదర్శి, రాహుల్ పంచులతో తేగ నవ్వించారు.
జాతి రత్నాలో చిట్టి సాంగ్ హైలెట్.. ఈ చిత్రంలో బ్రహ్మానందంతో ఉండే కామెడీ సీన్స్ థియేటర్లో నవ్వులు పుట్టిస్తాయి. అలాగే హీరోయిన్ కీర్తి సురేష్ గెస్ట్ రోల్ లో వచ్చి ఆడియన్స్ కి షాక్ ఇచ్చింది.. ఓవర్ అల్ గా మహా శివరాత్రి కి కడుపుబ్బ నవ్వించే చిత్రమని నిర్మొహమాటంగా చెప్పవచ్చు.
Rating : 3.5 / 5 (Comedy Hit)