movie reviews

జనతా హోటల్ మూవీ రివ్యూ

 నటీనటులు : దుల్కర్ సల్మాన్, నిత్యామీనన్, తిలకన్, అస్సిం జమాల్, సద్దిక్యూ తదితరులు

సంగీతం : గోపీ సుందరం

సినిమాటోగ్రఫీ : ఎస్. లోకనాథన్

దర్శకత్వం : అన్వర్ రషీద్

నిర్మాతలు : సురేష్ కొండేటి

ప్రముఖ మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కొడుకుగా సినీ ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన దుల్కర్ సల్మాన్ అతి కొద్ది కాలంలోనే తనకంటూ నటుడిగా ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. తెలుగులో ‘ఓకే బంగారం’ అనే మూవీతో ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. ఈ మూవీలో సల్మాన్ తో కలిసి నిత్యామీనన్ జంటగా నటించారు. మహానటి మూవీ ద్వారా ఒక్కసారిగా తెలుగు ప్రేక్షకులకు కూడా గుర్తుండిపోయే నటనతో ఆకట్టుకున్నాడు. దుల్కర్ సల్మాన్ చాలా మూవీస్ తెలుగులో కూడా డబ్ అయ్యాయి. అదే కోవలో దుల్కర్ మరియు నిత్యామీనన్ కలిసి మరోసారి జోడిగా రూపొందిన మలయాళ చిత్రం ‘ఉస్తాద్ హోటల్’. ఈ చిత్రాన్ని ‘janataa hotel’ పేరుతో సురేశ్ కొండేటి తెలుగులోకి డబ్ చేసారు. ఈ చిత్రం నిన్న విడుదలైంది. మరి ఈ జనతా హోటల్ ప్రేక్షకులని మెప్పించిందో లేదో తెలుసుకోవాలంటే సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం..

కథ:

కథలోకి వెళ్తే ఫైజీ(దుల్కర్ సల్మాన్) నలుగురు అక్కలకి ఒకే ఒక్క ముద్దుల తమ్ముడు ఫైజీ ఎక్కువ సమయం వంటగదిలోని తన అక్కలతోనే గడుపుతూ పెరుగుతాడు. తన అక్కలందరూ వారి వారి లైఫ్ లో సెటిల్ అవడంతో ఫైజీ కూడా చెఫ్ అవ్వాలన్న కోరికతో స్విజర్ లాండ్ వెళ్లి హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చేస్తున్నాని తండ్రికి అబద్దం చెప్పి చెఫ్ కోర్స్ చేసి తిరిగివస్తాడు. తను ప్రేమించిన అమ్మాయి సహాన(నిత్యా మీనన్) కి ఈ విషయం చెప్పినప్పుడు ఆ విషయం విన్న తండ్రికి తనకు మధ్య గొడవ జరుగుతుంది. దీనితో ఫైజీ ఇల్లు వదిలేసి కాకినాడలోని తన తాత కలామ్ దగ్గరకి వస్తాడు. అక్కడ ఫైజీ తాత కలామ్ నడుపుతున్న జనతా హోటల్ ని రన్ చేయాలి అనుకుంటాడు. ఒకప్పుడు తనను కాదనుకున్న చేసిన షహానాని ఫైజీ ప్రేమిస్తాడా ? తన తాత జనతా హోటల్ ని ఫైజీ ఎలా బాగు చేశాడు ? చివరకి ఫైజీ తన అనుకున్న లక్షాన్ని సాధించాడా లేడా ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:

డైరెక్టర్ తీసిన ఈ janataa hotel కి స్టోరీ లైన్ మెయిన్ గా ఇంపార్టెంట్ అని చెప్పాలి. కాని ఆశించిన స్థాయిలో అనుకున్న కంటెంట్ ని ప్రేక్షకులకుచూపించడంలో డైరెక్టర్ విఫలమయ్యాడు. మన చుట్టూ ఉన్న సమాజంలో ఒక్క పూట కూడా అన్నం దొరకని సంఘటనల గురించిన భావోద్వేగమైన సన్నివేశాలతో చాలా చక్కగా చూపించారు. కాని కొన్ని సీన్స్ సాగదీసినట్టుగా ఉంటాయి. కథలో ప్రదాన పాత్ర అయిన తిలకన్ పాత్ర, జనతా హోటల్ బాగు అయిన తరువాత కూడా చూసి ఆనందించి ఉంటే ఆ పాత్ర పట్ల పూర్తి న్యాయం చేసినట్లు ఉండేది. ఎంటర్టైన్మెంట్ కూడా పెద్దగా కనిపించదు. హీరో హీరోయిన్ల మధ్య లవ్ స్టోరీ కూడా  అంత ఆసక్తిగా అనిపించదు. ఇది మలయాళ ప్రేక్షకులకు నచ్చేట్టుగా తీసిన మూవీ కావడంతో తెలుగు ఆడియన్స్ కి పెద్దగా రుచించకపోవచ్చు.

నటీనటులు:

ఎప్పటిలాగే దుల్కర్ ఈ మూవీలో కూడా హాండ్సమ్ గా, స్టైలిష్ గా ఆకట్టుకున్నాడు. తన క్యారెక్టర్ కి పూర్తి న్యాయం చేసాడనే చెప్పాలి. నటన విషయానికి వస్తే బరువైన కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో కూడా చాలా సెటిల్డ్ గా నటిస్తూ ఆకట్టుకున్నాడు. సీనియర్ నటులు తిలకన్ ఎప్పటిలాగే తమ నటనతో ప్రేక్షకులని అబ్బురపరుస్తారు. నిత్యా మీనన్ కూడా చాలా చక్కగా నటించింది. తన అందంతో పాటు తన అభినయంతో కూడా మెప్పించే ప్రయత్నం చేసింది. దుల్కర్ నిత్యా కెమిస్ట్రీ కూడా మంచి ఫీల్ ని క్రియేట్ చేస్తోంది. అక్క పాత్రల్లో నటించిన నటీమణులు, మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేశారు.

 సాంకేతిక విభాగం :

దర్శకుడు అన్వర్ రషీద్ చాలా చక్కని పనితనం కనబర్చాడు. గోపిసుందర్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకే హైలెట్ అని చెప్పాలి. అన్వర్ రషీద్ దర్శకుడిగా ఈ ‘janataa hotel’ చిత్రాన్ని అందంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేసినప్పటికీ కథనం మీద ఇంకా శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. ఎస్. లోకనాథన్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ అంత గొప్పగా ఉండదు. నిర్మాణ వలువలు కధానుసారంగా ఉంటాయి.

ప్లస్ పాయింట్స్: 

దుల్కర్ సల్మాన్

ఎమోషనల్ సీన్స్

బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్:

ఎడిటింగ్

స్క్రీన్ ప్లే

కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడం

తీర్పు:

ఈ జనతా హోటల్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ముఖ్యంగా చెఫ్ లకు హోటల్ కు సంబంధించిన వ్యక్తులకు బాగా నచ్చుతుంది. డబ్బింగ్ సినిమా కావడంతో అన్ని వర్గాల ప్రేక్షకులను ఈ చిత్రం ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.

 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button