సినిమా :- జల్లికట్టు (2020)
Jallikattu telugu movie 2020

Jallikattu telugu movie 2020:: నటీనటులు :- ఆంథోనీ వర్గీస్, చెంబన్ వినోద్ జోస్, సబుమోన్ అబ్దుసామద్, శాంతి బాలచంద్రన్
మ్యూజిక్ డైరెక్టర్:- రెంగనాథ్ రవీ
నిర్మాతలు :- థామస్ పానికర్
డైరెక్టర్ :- లిజో జోస్ పెల్లిస్సేరి
కథ:-ఈ కథ దర్శకుడు పెల్లిస్సేరి యొక్క సొంత రాష్ట్రం కేరళలోని కొండలలోని ఒక మారుమూల గ్రామంలో మొదలవుతుంది. ఇక్కడ ఒక గేదె కసాయి ఉండేవాడు. ఆ ప్రదేశం లో ఉన్న మనుషుల మీద కోపం మరియు ఉద్రేకం తో ఒక గేదె తన కసాయి నుండి తప్పించుకొని ఊరంతా ఉల్లాసంగా ఉత్సాహంగా తిరుగుతుంది. అపుడు తనకు ఆ ఊరి ప్రజాలు తనను ఎలా హింసించారో గుర్తుతెచ్చుకొని ఆ ఊరిలో ఉన్న షాపులు మరియు పంటల్ని నాశనం చేస్తుంది. ఆ ఊరిలో ఉన్న ప్రజలు ఎలాగైనా ఆ గేదెను పట్టుకోవాలని రెండు వర్గాలుగా మారి తనని పట్టుకునే ప్రయత్నం చేస్తారు. కానీ గేదె మనుషుల అంచానని మించి ప్రజలని పాతుకొనివ్వకుండా తపించుకుంటుంది. అసలు గేదె ఎందుకు ఆలా చేస్తుంది. గేదె కి ప్రజలకి మధ్య ఉన్న విబేధాలు ఏంటి అసలు జల్లికట్టు ఏంటో తెలుసుకోవాలంటే ఈ సినిమా ఆహ లో చూడాల్సిందే.
Credit: aha videoIN* ఇది నిజ జీవితం లో జరిగిన సన్నివేశం. అందరు చక్కగా నటించారు కాదు జీవించారు.
* సినిమాకి సంబంధించిన ప్రతి ఒక క్యారెక్టర్ ని చాలా క్లుప్తంగా వివరించారు.
* డైరెక్టర్ కథ మరియు కథనం చక్కగా వ్రాసుకున్నారు.
* బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కొత్తగా ఉంది.
*సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.
* ప్రొడక్షన్ విలువలు కూడా చాలా బాగున్నాయి.
* దర్శకుడు క్లైమాక్స్ లో తప్పు ఎవరిది అని సరిగా చూపించలేకపోయారు దాని ఓరాజలే తెలుసుకోవాలని వదిలేశారేమో .
ముగింపు :-
మొత్తానికి జల్లికట్టు సినిమా ప్రతిఒక్కరిని కనువిప్పు చేసే సినిమా అవుతుంది అని మాటలో ఎలాంటి సందేహం లేదు. దర్శకుడు నిజజీవితం లో జరిగిన సన్నివేశాలని ఏంటో చక్కగా రూపొందించారు. నటీనటులు కూడా ఎక్కడ నటిస్తున్నట్లు కనిపించలేదు నిజానికి వారందరు పాత్రలో జీవించేసారు. మ్యూజిక్ చాల కొత్తగా సినిమాకి ఇంకో మీరు ఏకించింది. నిర్మల విలువలు బాగున్నాయి కెమెరా పని తీరు సి జి వర్క్ చాల చక్కగా ఉంది. మొత్తానికి కుటుంబమంతా ఈ వారం కలిసి జల్లికట్టు సినిమా చూసేయండి.
రేటింగ్ :- 3/5