దయచేసి నా ఫోటోలని తొలగించండి అంటూ వేడుకుంటున్న నటి

jaira wasim: దంగల్.. బాలీవుడ్ లో ఈ చిత్రం భారీ హిట్ సాధించిన విషయం అందరికి తెలిసిందే… కానీ చిత్రంలో మనకు ముఖ్యంగా అమీర్ ఖాన్ పెద్ద కూతురి పాత్రలో ” జైరా వసీం”..తన నటన తో ప్రేక్షకులను మెప్పించింది.. దీంతో ఆమెకు అభిమానులు పెరిగిపోయారు… సోషల్ మీడియాలో ఆమెకు విపరీతమైన ఫాలోయింగ్ ఉందంటే మీరు నమ్ముతారా… ఆమె పేరు పై లెక్కలేనన్ని ఫ్యాన్ పేజీలు పుట్టుకొచ్చాయి ఆమె ఒక ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేస్తే… ఆ ఫోటోలు లెక్కలేనన్ని షేర్లు లైకులు,కామెంట్లు నెటిజన్ల నుండి నుండి అలవోకగా వస్తున్నాయి… అంటే ఆమె ఎంత క్రేజ్ సంపాదించుకుందో ఒక్కసారి ఊహించుకోండి… ఆమె నటనకు ఇండియాలొనే కాదు పాకిస్తాన్ లో కూడా అభిమానులు ఉన్నారు..అలాంటి నటి తాజాగా అభిమానులకు షాక్ ఇచ్చింది…
” ఇప్పటివరకు నా పై చూపించిన అభిమానానికి కృతజ్ఞతలు.. నేను ఏ స్థితిలో ఉన్నా నన్ను మీరు ఆదరిస్తూనే వున్నారు.. మీ ప్రేమకు నేను ధన్యురాలిని…మీరు నా కోసం ఒక చిన్న సహాయం చేసి పెట్టాలి.. సోషల్ మీడియాలోని ఫ్యాన్ ఎకౌంట్లో నా ఫోటోలన్ని తొలగించాలి… సోషల్ మీడియాలో నా ఫోటోలు ఉండకుండా చూడాలి.. దాదాపు ఒక్క ఫోటో కూడా లేకపోవడం చేయడం చాలా కష్టం …కానీ సాధ్యమైనంతవరకు నా ఫోటోలు ఆన్లైన్లో ఉండకుండా చూడాలి.. ఎందుకంటే నా జీవితంలో మరో అంకానికి శ్రీకారం చుట్టబొతున్నాను ” అన్ని జైరా వసీం ఆసక్తికరంగామైన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.. దీంతో జైరా పలువురు అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు