Tollywood news in telugu

బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న జగపతి

కొన్నేళ్ళ క్రితం టాలీవుడ్ లో ఫ్యామిలీ హీరోగా మంచి పేరు తెచ్చుకున్న jagapatibabu  ఆ తరువాత అయన హీరోగా నటించిన సినిమాలు పెద్దగా హిట్ కాకపోవడంతో విలన్ గా  క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాడు. లెజెండ్‌ సినిమాతో విలన్‌గా టర్న్‌ అయి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న జగపతిబాబు `రంగ‌స్థ‌లం`, `గూఢ‌చారి`,సాక్ష్యం వంటి ప‌లు సినిమాల్లో విల‌న్‌గా తన విశ్వరూపం చూపించారు. విలన్ పాత్రలో జగపతిబాబు నటన అద్భుతంగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. వరుస సినిమాలతో జగపతిబాబు చాలా బిజీగా ఉంటున్నారు.

జగపతిబాబు కాల్షీట్లకు ఇప్పుడు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దక్షిణాదిన ఇప్పుడు క్రేజ్ ఉన్న నటుడిగా jagapatibabu  మారిపోయాడు. ఇప్పుడు బాలీవుడ్‌ ఎంట్రీకి కూడా రెడీ అవుతున్నారు. తెలుగులోనే కాదు త‌మిళ‌, మ‌ల‌యాళ ఇండస్ట్రీల నుంచి కూడా జ‌గ‌ప‌తిబాబుకు మంచి అవ‌కాశాలు వ‌స్తున్నాయి. సెకండ్‌ ఇన్నింగ్స్‌లో ఫుల్‌ ఫాంలో దూసుకుపోతున్నjagapatibabu  తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కలిపి 13 సినిమాలు చేస్తున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరో అజ‌య్ దేవ‌గ‌ణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా `తానాజీ`. చిత్రానికి ఓం రావత్‌ దర్శకుడు. ఛత్రపతి శివాజీ కోసం పోరాడిన సుబేదార్‌ తానాజీ మలుసారే పాత్రలో అజయ్‌ దేవగన్‌ నటిస్తున్నారు. చారిత్ర‌క నేప‌థ్యం క‌లిగిన ఈ సినిమాలో jagapatibabu new look  ఓ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. కొన్ని రోజుల కింద‌ట‌ ఈ క్యారెక్టర్ కి సంబంధించిన లుక్ టెస్ట్ జ‌రిగింది. పూర్తి డీటెయిల్స్ తెలియకపోయిన తాజాగా ఆ ఫోటోలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి. ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. మెలితిప్పిన మీసాలు నెరిసిన గుబురు గడ్డంతో నారింజ రంగు తలపాగా ధరించి మరాఠా యోధుడిగా దర్శనమిచ్చాడు.  వయకామ్ 18 మోషన్ పిక్చర్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ లో మొదలు కాబోతుందని సమాచారం. ఈ సినిమాలో మరో ప్రత్యేకత కూడా ఉండబోతుంది అది ఏంటంటే అజయ్ దేవగణ్ , కాజోల్ జోడి రీల్ లైఫ్ లో తిరిగి 9 ఏళ్ళ తర్వాత కలిసి నటిస్తున్నారు.

 

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button