jagapathi babu :యేసు క్రీస్తులా మారిపోయిన జగపతి బాబు…షాక్ కి గురి అవుతున్న అభిమానులు !

jagapathi babu : టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతి బాబు ఫొటోను చూసి అభిమానులు షాక్ కి లోనవుతున్నారు. అసలు అతను అజగపతి బాబూయేన అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. అలాగే యేసు క్రీస్తు కి సంబందించిన ఏదైనా సినిమా తీస్తున్నారా అని జగపతి బాబు ను షోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
ఈ ఫొటోలో రక్తం కారుతోన్న ముఖం, మేకులతో సిలువకు కొట్టిన చేతులు, తలకు ముళ్ల కిరీటం, ధరించి అచ్ఛం యేసు ప్రభులాగే ఉన్నాడని అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
కానీ అభిమానులు వేసిన ప్రశ్నలకు మాత్రం ఎలాంటి సమాధానం రాలేదు. ఇక త్వరలో ఈ ఫోటో కి సంబందించిన ప్రకటన వస్తుందేమో చూడాలి.
ప్రస్తుతం జగపతి బాబు.. విద్యాసాగర్ దర్శకత్వం వహిస్తున్న ఫాదర్-చిట్టి-ఉమా-కార్తిక్ అనే చిత్రంలో నటిస్తున్నారు . ఈ సినిమాని ఫిబ్రవరి 12న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో జగపతి బాబు తండ్రిగా చేస్తునట్టు సమాచారం. అలాగే పలు సినిమాల్లోకూడా జగపతి బాబు బిజీగా గడుపుతున్నాడు.