Tollywood news in telugu
జబర్దస్త్ ముక్కు అవినాష్ ఆత్మ హత్య యత్నం…

Jabardasth avinash: జబర్దస్త్ కమెడీయన్ ముక్కు అవినాష్ , అడపాదడపా షోస్ చేసుకుంటూ ఒక్కసారిగా బిగ్ బాస్ లాంటి షో లో పార్టిసిపేట్ చేయడం అంటే మామూలు విషయం కాదు, మధ్యలో ఎంట్రీ ఇచ్చి డల్ గా సాగుతున్న ప్రోగ్రాం కి ఊపుని తీసుకొచ్చాడు, తనదైన కామెడీ టైమింగ్ తో అలరిస్తున్నాడు.
అయితే తన కష్టాల గురించి బిగ్బస్ షో లో ప్రస్తావన తెస్తు తాను ఆత్మ హత్య చేసుకోవాలని అనుకున్న అని చెప్పాడు, తాను అనారోగ్యం తో ఉన్న పేరెంట్స్ ని చూసుకుంటూ అలాగే ఈ లాక్ డౌన్ లో ఆర్థిక సమస్య తో చాలా ఇబ్బంది పడ్డానని అలాగే తన ఈ ఎం ఐ 45000 వరకు ఉందని , అలా ఒకానొక సమయంలో ఆత్మ హత్య చేసుకోవాలని అనిపించిందని అన్నాడు, అక్కడ ఉన్న మరో పార్టిసిపేట్ మాస్టర్ అమ్మ రాజశేఖర్ ఎప్పటికీ అలా అనుకోవద్దు అని అన్నారు.