Jabardast dhorababus wife shocking reaction over the prostitution case
Jabardast dhorababus wife shocking reaction over the prostitution case
Jabardast dhorababus wife shocking reaction over the prostitution case :: జబర్దస్త్ నటులు దొరబాబు, పరదేశీ పోలీస్ రైడింగ్‌లో దొరికిన తర్వాత చాలా మార్పులు చేర్పులు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈయన ఇకపై కామెడీ షోలో వస్తాడా రాడా అనేది కూడా ఆసక్తికరంగానే చర్చ జరుగుతుంది
అయితే వాళ్లను తీసేయాలనే ఉద్దేశ్యం మాత్రం హైపర్ ఆదిలో కనిపించడం లేదు. కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చి మళ్లీ తీసుకురావాలని చూస్తున్నాడు. ఇదిలా ఉంటే వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన తర్వాత దొరబాబు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటికి వస్తున్నాయి. ఈయన భార్య అయితే భర్తకు పూర్తి అండగా నిలుస్తుంది. అక్కడ జరిగిన విషయం ఏంటనేది అందరికీ తెలుసు. కానీ అలాంటి సమయంలో కుటుంబమే వెలేస్తే మాత్రం పరిస్థితులు దారుణంగా ఉంటాయి.
అందుకే దొరబాబు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది అనేది పక్కనబెడితే అతని భార్య నందు మాత్రం అతనికి సపోర్ట్ ఇస్తుంది. అలాంటి పరిస్థితుల్లో భర్తను చూసిన తర్వాత ఏ భార్యకైనా కూడా కచ్చితంగా కోపం వస్తుంది. కానీ ఈమె మాత్రం తన భర్త గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెబుతుంది. తనను ప్రాణంగా చూసుకుంటాడని.. కూతుర్ని కాలు కింద పెట్టకుండా చూసుకుంటున్నాడని చెబుతుంది నందు. ఈమె నెల్లూరు లోకల్ ఛానెల్లో యాంకర్ కూడా. 2018లో ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు దొరబాబు. అప్పట్నుంచి ఇద్దరూ అన్యోన్యంగా కలిసున్నారు. బి గ్రేడ్ అడల్ట్ షార్ట్ ఫిల్మ్స్ చేసాడని తెలిసినా కూడా దొరబాబును ప్రేమించి పెళ్లి చేసుకుందంటే అతనెంత మంచివాడో అర్థం చేసుకోండి అంటున్నారు దొరబాబు సన్నిహితులు.