మృతదేహాలతో సెల్ఫీ దిగిన పోలీస్….అక్కడ అదంతా కామన్ !

అటుగా వెళ్తున్న కొంతమంది ప్రజలు ఒక ఇంటి పై కప్పుపై , ఇంటి ముందు, చెత్తడబ్బాలలొ ఉన్న శరీర భాగాలు చుసి బెబ్బెలెత్తిపోయి పోలీసులకు సమాచారం అందించారు.

ఆ మనుషులను అతి కిరాతకంగా చంపినట్టు ఆ శవాలు కనబడుతున్నాయి. ఒకరిని తలపై కత్తితో నరికి నట్టు, మరొకరిని రంపంతో కోసినట్టు ఇంకో శవాన్ని బ్లాక్ కవర్లో చుట్టి ఉన్నట్టు తెల్సుస్తుంది.

హుటాహుటిన ఆ ప్రదేశానికి చేరుకున్న పోలీసులు ఆ శవాలతో సెల్ఫీలు తీసుకోవడం, వారి పిల్లల్ని తీసుకొచ్చి సరదాగా భయపెట్టడం చేస్తున్నారు.

అదేంటి అనుకుంటున్నారా…?
అమెరికాలోని ‘డల్లాస్’ లో ఒక వ్యక్తి నిజంగా హత్యలు జరిగాయా అన్నట్టు ఈ కళాకండాలను రూపొందించాడు. ప్రతీ సంవత్సరం అక్టోబర్ నెలలో జరిగే ‘హాలోవీన్ ‘ పండగ సందర్బంగా అక్కడి ప్రజలు ఇలా బిమ్మలను , అస్థిపంజరాలు, మనుషుల పుర్రెలను ఇంటి ముందు ఉంచుతారు.

ఈ హత్యలు నిజగా జరిగాయని కొంతమంది అటుగా వెళ్తున్నవారు చూసి పోలీసులకు ఫోన్ కూడా చేశారట. అంటే చుడండి ఈ కళాకండాలు గుర్తుపట్టలేనంతగా ఎంత నాచురల్ గా రూపొందింరో తెలుస్తుంది.

సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకొని వాటిని కాసేపు అబ్సర్వ్ చేసాక అవి బొమ్మలు అని తెలుసుకొని వాటితో సెల్ఫీలు దిగారు.
డల్లాస్ లో ఇలాటి ఆశ్చర్య కరమైన ఘటన జరగడం ఇదే మొదటి అని పోలీసులు తెలిపారు.