Real life stories
37 సార్లు పాముకాటు వేసింది… ఇక ప్రభుత్వమే ఆదుకోవాలి !

మన ఇండియా లో ఎక్కువగా పల్లెటూర్లలో పాములు ఉంటాయని తెలిసిందే, ఎక్కువగా రైతులే ఈ పాము కాట్లకు బలి అవుతూ ఉంటారు. కానీ మానవ జీవితంలో పాము 1 లేదా 2 సార్లు పాము కుడుతుంది. ఇలా కుట్టగానే బ్రతికి బయట పడ్డాక మల్లి పాము కుట్టకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాము.
కానీ ఇక్కడ ఒక వ్యక్తి ఏకంగా 37 సార్లు పాముకాటుకు గురి అయ్యాడు. వివరాల్లోకి వెళ్తే….
చిత్తూరు జిల్లా బైరెడ్డి పల్లె మండలం, కురువురు గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం (40) అనే వ్యక్తి వ్యవసాయపనులు చేసుకుంటూ ఉండగా ఈ పాము కాట్లకు గురి అవుతున్నానని వాపోతున్నాడు.
ఇలా పాము కాటు వేసినప్పుడల్లా 10 వేయిల రూపాయలు ఖర్చు అవుతున్నాయని, ఇలా ప్రతిసారి కష్టపడ్డా డబ్బులన్నీ పాము కాటుకు పెట్టాల్సి వస్తుందని. ఇక మమల్ని ఈ ప్రభుత్వమే ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరాడు.