ishq 2021 telugu movie – ఇష్క్ (2021)

ishq 2021: సినిమా :- ఇష్క్ (2021)
నటీనటులు :- తేజ సజ్జా, ప్రియా ప్రకాష్ వారియర్
నిర్మాతలు:- : ఎన్.వి.ప్రసాద్, పరాస్ జైన్, వకాడ అంజన్ కుమార్
డైరెక్టర్ :- ఎస్.ఎస్.రాజు
లాక్ డౌన్ తర్వాత థియేటర్స్ లో విదుదలైన చిత్రాలలో తేజ సజ్జా నటించిన ఇష్క్ ఒకటి. ఎన్నో నెలల తర్వాత ప్రేక్షకుల మనసుని ఓటీటీ నుంచి థియేటర్ కి లాగే ప్రయత్నం చేస్తున్నారు సినీ వర్గాలు. ఈ తరహాలోనే ఇష్క్ వచ్చింది. ఇపుడే సినిమా ఎలా ఉందొ చూద్దాం.
ishq 2021 Story
ఈ సినిమా సిద్ధూ(తేజ) మరియు అను(ప్రియా) లా మధ్య ఉన్న విపరీతమైన ప్రేమతో మొదలవుతుంది. ఇద్దరికి ఒకరంటే ఒకరికి పిచ్చి ప్రేమ. అయితే ఒకానొక రోజు సిద్ధూ అను పుటిన రోజున జీవితకాలం గుర్తుండిపోయేలా, ఆశ్చర్యపోయేలా చేయాలనీ ప్లాన్ చేసి అను ని తీసుకొని లాంగ్ డ్రైవ్ వెళ్తాడు. అయితే ప్రకృతి రొమాంటిక్ గా ఉండటంతో ఇద్దరు కార్ లోనే రొమాన్స్ చేస్తుండగా, పోలీస్ ఆఫీసర్ గా ఉన్న ఒక మనిషి అది చూసి వారిద్దరిని చిత్రహింశాలు పెడుతుంటాడు ఆరోజు రాత్రి. సిద్ధూ ఎం చేస్తాడు? అనుని పోలీస్ నుంచి రక్షించుకోగలుగుతాడా లేదా? సిద్ధూ పోలీస్ లా వచ్చిన మనిషి మీద పగ ఎలా తీర్చుకుంటాడు? చివరికి ఎం జరగబోతుంది? అని తెలుసుకోవాలంటే ఈ సినిమా థియేటర్ లో చూడాల్సిందే.
ishq 2021 Review
👍🏻:-
- తేజా సజ్జా మరియు ప్రియా వారియర్ తమ పాత్రలలో జీవించేసి ప్రజలను ఆకర్షిస్తారు. వీరిద్దరి నటనకు మంచి ప్రశంశలు అందుతాయు అనే విషయం లో ఎటువంటి సందేహం లేదు.
- విల్లన్ గా చేసిన రవీంద్ర విజయ్ కూడా ఆకట్టుకుంటాడు.
- పాట మరియు సినిమాటోగ్రఫీ చాల బాగుంది.
- కథ మరియు కథనం కొత్తగా ఉన్నాయి.
- దర్శకుడు ప్రతి చిన్న విషయం చాల క్లియర్ గా చూపించేసి హిట్ తన ఖాతాలో వేసుకున్నారు.
- నిర్మాణ విలువలు బాగున్నాయి.
👎🏻:-
- మొదటి 20 నిముషాలు సినిమాకి సంబంధం లేకుండా లవ్ ట్రాక్ తో బోర్ కోటిస్తారు.
- సినిమాలో ఎటువంటి మార్పులు చేయకుండా మలయాళం ఇష్క్ సినిమాని ఉన్నదీ ఉన్నట్లు చూపించడం.
ishq 2021 Final Verdict
మొత్తానికి ఇష్క్ అనే సినిమా తేజ సజ్జా మరియు ప్రియా ప్రకాష్ వారియర్ కెర్రిర్ లో ఇంకో మెట్టు పైకి తీసుకెళ్తుంది. ఇద్దరు పోటాపోటీగా నటించారు. విల్లన్ గా రవీంద్ర కూడా మెప్పిస్తాడు. కథ మరియు కధనం కొత్తగా ఉండటం తో ప్రేక్షకులకు నచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి , కాకపోతే లవ్ ట్రాక్ ఏ ఎక్కువ ఉంటుంది, కామెడీ ఉంటుంది అని అనుకునే వాళ్ళు నిరాశతో బయటికి వస్తారు. కొత్తదనం కోరుకునేవాళ్ళు ఈ సినిమా చూసేయచ్చు.
రేటింగ్ :- 2.5/5