Tollywood news in telugu
ఎంటి ఇది నిజమేనా? ఇది మన నాగబాబు నా?

నాగబాబు అనగానే చిరంజీవి తమ్ముడు అనే మార్క్ నుండి తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు, ఒక ప్రొడ్యూసర్ గా, ఒక క్యారెక్టర్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకోగా , జబర్థస్త్ అనే ప్రోగ్రాం తో ఇంటింటికీ పరిచయం అయ్యాడు, అపుడపుడు కాంట్రవర్సీ లో ఉన్న, తనదైన శైలిలో ఎదో ఒక ఆక్టివిటీ తో మీడియా లో ఉంటాడు.
ఇక ఇటీవలే తన కూతురి పెళ్లి చేసి బాధ్యత తీర్చుకున్న, ఈ వయసులో కూడా ఎదో కొత్తదనం కోసం తాపత్రయ పడుతుంటాడు, అదే కోవలో సోషల్ మీడియాలో ఒక మేకోవర్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు.
బాడీ బిల్డ్ చేసిన ఫోటో , బనియన్ లో ఒక రెస్లర్ గా అగుపడుతున్నాడు… ఇక ఒక క్యాప్షన్ కూడా పెట్టాడు… సింహం దాని బలపరిమానం వల్లే రాజు కాలేదు , దానికున్న ఆటిట్యూడ్ వల్ల రాజు అయిందని, మరి ఇంతకీ రాజు ఎవరో చెప్పలేదు మన నాగబాబు గారు, ఇలా తనదైన శైలిలో కామెడీ పండిస్తున్నారు మన నాగబాబు …,😂