Tollywood news in telugu

Is there Fahadh Fassil in Pushpa the rise : పుష్ప ది రైజ్ లో ఫహద్ ఫజిల్ కనిపించరంట ?:-

Is there Fahadh Fassil in Pushpa the rise : ఏ సినిమా అయినా రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ అటు అభిమానుల్లో మరియు చిత్రబృందం కి టెన్షన్ సహజమే సినిమా ఎలా ఉండబోతుంది ? ప్రేక్షకులు అనుకున్న హైప్ కి రీచ్ అవుతుందా లేదా అని ? ఇలా అనేక రకాల టెన్షన్స్ ఉంటాయి. కానీ రిలీజ్ కి ఇంకా రెండు నెలలు టైం ఉన్న ఇప్పటినుంచే అభిమానానుల్లో ఎన్నో డౌట్స్ తెపిస్తున్న సినిమా బన్నీ సుకుమార్ ల పుష్ప ది రైజ్.

పుష్ప మొదటి భాగం డిసెంబర్ 17 న విడుదలకీ సిద్ధం అయింది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన పాటలు మరియు పోస్టర్స్ అని వర్గాల ప్రేక్షకులని అలరించింది. ముఖ్యంగా ఈ సినిమాలో విలన్ గా కనిపించే ఫహద్ పోస్టర్ తెలుగు ప్రేక్షకులనే కాకుండా ఇతర బాషా ప్రేక్షకులని కూడా ఆకట్టుకుంది.

అయితే ఇపుడు ఇండస్ట్రీ లో విపరీతంగా నడుస్తున్న టాక్ ఏంటంటే పుష్ప లో విలన్ ఫహద్ ఏ కానీ మొదటి భాగం లో అసలు కనిపించడని టాక్ విపరీతంగా వినిపిస్తుంది. ఫ్యాన్స్ అందరు బన్నీ మరియు ఫహద్ మధ్య సీన్స్ ఏ సినిమాకి హై లైట్ అవబోతున్నాయి అని ఊహలో ఉంటె ఈ వార్త వినగానే షాక్ కి గురయ్యారు.

ఈ వార్త ఎంతవరకు నిజమో తెలియదు కానీ ప్రస్తుతం పుష్ప సినిమా మీద జరిగే చర్చలలో ఇదే టాక్ ఎక్కువ ఉంది. దీనికి గల కారణం ఏంటంటే పుష్ప మొదటి భాగం లో పుష్పరాజ్ కి విలన్ గా సునీల్ కనిపించబోతున్నారని , సునీల్ పాత్రా ముగిసే సమయానికి ఫహద్ ఎంట్రీ ఉండబోతుందని , ఇది చివరి 20 నిమిషాల్లో జరగబోతుంది అని టాక్ వినిపిస్తుంది.

ఇదే కనుక నిజం అయితే అటు ఫహద్ అభిమానులు , ఫహద్ మరియు బన్నీ మధ్య ఫైట్స్ ఉంటాయి అని ఊహించుకునే అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతారు. చూడాలి మరి పుష్ప ది రైజ్ లో ఫహద్ ఎక్కువ సేపు ఉండకపోయినా పార్ట్ 2 లో మొత్తం అభిమానులు అనుకున్న రేంజ్ లోని ఉండబోతుంది. చూడాలి మరి పుష్ప పార్ట్ 1 ట్రైలర్ చుస్తే కానీ అందరు ఒక అంచనాకు రాకపోవచ్చు .

Tags

Leave a Reply

Your email address will not be published.

Back to top button