Is SRK Remaking Nani Film : షారుఖ్ ఖాన్, నాని సినిమాని రీమేక్ చేస్తున్నారా ? :-

Is SRK Remaking Nani Film ? :- ” షారుఖ్ ఖాన్ ” ఈ పేరు సిల్వర్ స్క్రీన్ పైన చూసి దాదాపు 3 ఏళ్ళు దాటిపోయింది. వరుస సినిమాలతో బిజీ ఉన్నపటికీ ఏ ఒక సినిమా విడుదలకు సిద్ధంగా లేదు.
ఇదిలా ఉండగా షారుక్ తమిళ డైరెక్టర్ ” అట్లీ ” తో కలిసి ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కి వర్కింగ్ టైటిల్ గా ” లయన్ ” అని కూడా ఫిక్స్ చేసారని చిత్రసీమలో టాక్ ఉంది.
అయితే ఈ సినిమా ఒక రాబరీ చుట్టూ తిరుగుతుంది అని షారుక్ హింట్ ఇచ్చారు. దానికితోడు ఈ సినిమాలో ” నయనతార ” , ” ప్రియమణి ” , ” సానియా మల్హోత్రా ” మరియు ఇతర అమ్మాయిలు కలిసి షారుక్ ని తమ రివెంజ్ కి హెల్ప్ చేయండి అని కోరుతారు. ఈ లైన్ చదవగానే మనకు ముందువరసలో గుర్తొచ్చేది ” న్యాచురల్ స్టార్ నాని ” నటించిన ” గ్యాంగ్ లీడర్ ” అనే సినిమా.
కొంచెం లైన్ అలాగే ఉండేసరికి, దానికితోడు సినిమాలో లేడీస్ ఎక్కువ ఉండేసరికి అందరి ఆలోచనలు గ్యాంగ్ లీడర్ ఫ్రీమేక్ అని ఆలోచనలో పడేలా చేస్తున్నాయి.
షారుక్ ఖాన్ హింట్ ఇచ్చిన ప్రకారం చుస్తే గ్యాంగ్ లీడర్ సినిమా స్టోరీ తో చేంజెస్ చేసి ” మనీ హీస్ట్ ” స్టైల్ లో తీయాలనుకున్నారని అర్ధం అవుతుంది.
ముందే తెలుగు లో గ్యాంగ్ లీడర్ సినిమా ప్లాప్ , అదే స్టోరీతో ఫ్లోప్స్ లో ఉన్న షారుక్ తీయడం ఏంటి అని నెటిజనులు అనుకుంటున్నారు. ఇంకా అధికారికంగా ఏది ప్రకటించకపోయినా షూటింగ్ జరిగే సన్నివేశాలు చుస్తే ఇలాగె అనిపిస్తుంది. చూడాలి మరి అట్లీ ఇదే కథ తో వస్తున్నారో లేదా వేరే కథ తో వస్తున్నారో వేచి చూడాలి.