Is Anasuya Greater than Thamanna ? : తమన్నా కంటే అనసూయ గొప్పదా ? :-

Is Anasuya Greater than Thamanna ? : ఏంటి సంబంధం లేకుండా అడుగుతున్నా అని అనుకోకండి. ఇపుడు ఇదే హాట్ టాపిక్ గా మారిపోయింది. తమన్నా అంటే ఎవరికీ ఇష్టం ఉండదు. థియేటర్లో అయినా , ఓటీటీ లో అయినా దశాబ్ద కాలం నుంచి తమన్నా కనిపిస్తే చాలు కుర్రాళ్లు చూడకుండా ఉండలేరు. తమన్నా సినిమా విడుదల అయితే క్యూ లో నిలబడిపోయారు.
అలాంటి తమన్నా నెగటివ్ రోల్ చేసిన చూస్తున్నారు. ఓటీటీ లో తమన్నా దాదాపు 2 వెబ్ సిరీస్ మరియు 2 సినిమాలు విడుదల చేసింది. అన్ని భారీ విజయాలే. ఇపుడు అదే ఫ్లో తో తమన్నా ని బుల్లితెర మీద హోస్ట్ గా ప్రకటించి జెమినీ టీవీ లో మాస్టర్ చెఫ్ అనే షో చేస్తున్న విషయం అందరికి తెలిసిందే.
కాకపోతే తమన్నా బుల్లితెర మీద కనిపిస్తూ, అలరిస్తూ అందరిని ఎంటర్టైన్ చేస్తున్నప్పటికీ రేటింగ్ మాత్రం రావడం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ షో ప్లాప్ అయింది. దీనికి అనేక కారణాలు ఉండచ్చు.
జూనియర్ ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు షో , నాగార్జున బిగ్ బాస్ సీజన్ 5 షో కి వచ్చే భారీ ఆదరణతో ఈ షో కి కొంచెం కూడా రాకపోవడం తో ఈ మాస్టర్ చెఫ్ షో లో తమన్నా ని తీసేసి అనసూయ ని పెట్టాలని నిర్ణయించుకున్నారని తెలిసింది.
అనసూయ అటు సినిమాలో మంచి ఇంపార్టెంట్ పాత్రలో కనిపిస్తూ , ఇటు బుల్లితెర లో కూడా టాప్ యాంకర్ గా పేరు పొందింది. కాబ్బటి ఎలాగో ప్లాప్ అయినా షో కి టాప్ యాంకర్ అయినా అనసూయని పెడితే జనాలు చూసి హిట్ చేసి టీ.ఆర్.పి పెరగచు అని ఈ షో యొక్క నిర్మాతలు , యూనిట్ భావిస్తున్నారు.
ఇపుడు ప్రస్తుతం తమన్నా తో చేయవలసిన షూట్స్ పూర్తిచేసి అనసూయతో కొత్తగా ప్రారంభించనున్నారు అని తెలిసింది. ఏదేమైనా తమన్నాని ఇలా తీసేయడం బాగోలేదు అని తన అభిమానులు సోషల్ మీడియా లో వ్యక్తం చేస్తున్నారు. చూడాలి మరి ఎం జరగబోతుందో.