Today Telugu News Updates
తెలుగు వారికీ గుడ్ న్యూస్ చెప్పిన … ఐఆర్ సి టి సి !

కరోనా లక్డౌన్ ఆంక్షలను ఎత్తివేయడంతో IRCTC తెలుగు వారికీ మంచి శుభవార్తను మోసుకచ్చింది. టూరిస్ట్ ప్యాకేజీలను ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్, వరంగల్, ఖమ్మం, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంటలో స్టాప్ లలో, పర్యాటకులు ఈ రైలు ఎక్కొచ్చు. తిరుచ్చిరాపల్లి, తంజావూరు, రామేశ్వరం, మధురై, కన్యాకుమారి లాంటి పర్యాటక ప్రాంతాలను దర్శించుకోవచ్చు. .
డిసెంబర్ 12 కి టూర్ ప్రారంభమవుతుంది. ఇది 7 రోజుల టూర్ ప్యాకేజీ. IRCTC దక్షిణ భారతదేశ యాత్ర టూర్ స్టాండర్డ్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.7140. కంఫర్ట్ ప్యాకేజీ ధర రూ.8610. గా నిర్ణయించింది.
ఆసక్తిగల గలవారు https://www.irctctourism.com/ వెబ్‌సైట్‌లోకి వెళ్లి ఈ ప్యాకెజీలను బుక్ చేసుకోవచ్చి అని IRCTC తెలిపింది.