Today Telugu News Updates

ఐపీఎల్ లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ సాధించింది వీళ్లే.. .

IPL player of the tournament: ఐపీఎల్ ఈ పేరు వినగానే క్రికెట్ అభిమానుల్లో ఏదో తెలియని కొత్త ఉత్సాహం పుట్టుక వస్తోంది. అలాంటిది సెప్టెంబర్ 19న ప్రారంభమైన 13వ సీజన్ ఐపీఎల్ 2020లో ఇప్పటివరకు ఎనిమిది టీంలు 112 మ్యాచ్ లు ఆడారు.. ఇప్పటికే కొన్ని టీంలు ముంబై ఇండియన్స్, రాయల్ చాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, సన్రైజర్స్ ప్లే ఆఫ్ కి చేరిపోయాయి. ఈసారి ఐపీఎల్ లో క్రికెటర్లు షాట్ లతో అదరగొడుతున్నారు… ముఖ్యంగా ఈసారి కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, పడికల్ పరుగుల వరద కురిపిస్తున్నారు… అలాగే ఐపీఎల్ బౌలింగ్లో ప్రతి ఒక్క టీం బౌలర్లు తమ బాలింగ్ ప్రదర్శనతో వికెట్లు పడగొట్టి అభిమానులను మైమరిపిస్తున్నారు. ముఖ్యంగా బుమ్రా,రబడలు వికెట్ల వర్షం కురిపిస్తున్నారు…. అసలకి ఈసారి ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ ఎవరికి దక్కుతుందో… అని అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు…

ఐపీఎల్ 2008 లో ప్రారంభమైన విషయం అందరికీ తెలిసిందే…. మొదటిసారి 2008లో ఆస్ట్రేలియన్ ప్లేయర్ షేన్ వాట్సన్ కి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ దక్కింది..
అలాగే 2009లో ఆడమ్ గిల్ క్రిస్ట్ కి ఆఫ్ ది టోర్నీ దక్కింది… 2010లో సచిన్ టెండూల్కర్ ముంబై ఇండియన్స్ కి ఆడి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీని సొంతం చేసుకున్నారు.

2011లో యూనివర్సల్ బాస్, వెస్టిండీస్ ఆటగాడు క్రిస్ గేల్ కి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ దక్కింది… 2012లో కలకత్తా నైట్ రైడర్స్ తరుపున ఆడిన సునీల్ నరేన్ కి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డు వరించింది…2013లో షైన్ వాట్సన్ కి, 2014లో మాక్స్ వెల్ కి, 2015లో ఆండ్రూ రస్సెల్ కి 2016లో ఇండియన్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కి, 2017 లో ఇంగ్లాండ్ జట్టు ఆటగాడు బెన్ స్టోక్స్ కి, 2018లో మళ్ళీ సునీల్ నరేన్ కి, 2019లో మళ్ళీ ఆండ్రూ రస్సెల్ కి ప్లేయర్ ఆఫ్ ది టోర్నీని అందుకున్నారు…. ఈసారి అన్ని జట్టులోని ఆటగాళ్లు పోటాపోటీగా ఆడి… క్రికెట్ అభిమానుల గుండెల్లో ఎప్పటికీ చెదరని ముద్ర వేసుకుంటున్నారు… దీంతో ఐపీఎల్ 2020 సీజన్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ అవార్డ్ ఎవరు దక్కించుకుంటారో వేచి చూడాల్సిందే….

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button