News

IPL Auction 2021 : IPL వేలంలో భారీ ధర పలికిన టాప్-5 ప్లేయర్స్ …ఎవరో తెలుసా…!

IPL Auction 2021 : IPL వేలం ఎంతో ఇంట్రెస్టింగ్ గా  సాగుతోంది. ఈ సారి ఆల్ రౌండర్స్ పై ద్రుష్టి కేంద్రీకరించినట్టు తెలుస్తుంది.  విదేశీ ఆల్ రౌండర్ల కోసం ఫ్రాంచైజీలు పెద్ద మొత్తంలో నే ఖర్చు చేస్తున్నారు.  ఇప్పటివరకు వేలంలో సేల్ అయిన టాప్ -5 ప్లేయర్స్ ఎవరో తెలుసుకుందామా…

IPL Auction 2021

రాజస్థాన్ రాయల్స్ క్రిస్ మోరిస్‌ను రూ.16.25 కోట్లకు కొనుగోలు చేసింది .   ఇప్పటి వరకు వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడు క్రిస్ మోరిస్ . క్రిస్ మోరిస్ ను కొనుగోలు చేయడానికి  ముంబై, రాజస్థాన్ పోటీ పడ్డాయి. బేస్ ప్రైస్ రూ.75 లక్షలు అయితే అతడిని ఏకంగా రూ.16.25 కోట్లు ఇచ్చి రాజస్థాన్ రాయల్స్ దక్కించుకుంది.   మొత్తం ఐపీఎల్ చరిత్రలోనే ఇదే అత్యధిక ధర

ఇక న్యూజిలాండ్ ఆల్ రౌండర్ కైల్ జేమీసన్ కూడా ఎవరు ఊహించని  అత్యధిక ధర పలికాడు. ఈ కివీస్ ఆల్ రౌండర్ ను కోహ్లీసేన రూ.15 కోట్లకు దక్కించుకున్నారు.

ఆస్ట్రేలియా ఆల్‌రౌండ‌ర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్‌కు ఐపీఎల్‌లో ఏమాత్రం క్రేజ్ తగ్గలేదు. అంతేకాదు ఐపీఎల్ 2021కి ముందు అతడు కోరుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగ‌ళూరు (ఆర్సీబీ) జట్టే సొంతం చేసుకుంది.  బెంగ‌ళూరు ప్రాంచైజీ మ్యాక్సీని రూ.14.25 కోట్ల‌కు కొనుగోలు చేసుకున్నారు.  రూ.2 కోట్ల బేస్‌ప్రైస్‌తో వేలంలోకి దిగిన  మ్యాక్స్‌వెల్ కోసం ఫ్రాంచైజీలు పోటీ ప‌డ్డాయి. అత‌ని కోసం బెంగ‌ళూరు, చెన్నై ఫ్రాంచైజీలు తీవ్రంగా పోటీ పడి లాస్ట్ కి  బెంగ‌ళూరే అత‌న్ని దక్కించుకుంది.

ఐపీఎల్ 2021 వేలంలో ఆస్ట్రేలియా యువ పేసర్ జై రిచర్డ్‌సన్‌ కూడా అనూహ్య రీతిలో  రూ. 14 కోట్ల భారీ ధర పలికాడు. రూ.1.5 కోట్ల కనీస ధరతో వేలంలోకి దిగిన  ఈ ఆసీస్ పేసర్‌ను పంజాబ్ కింగ్స్ భారీ ధర వెచ్చించి దక్కించుకుంది.

ఇక భారత ప్లేయర్లలో ఇప్పటివరకు క్రిష్ణప్ప గౌతమ్ భారీ ధర పలికాడు. ఈ కర్ణాటక ప్లేయర్ ‌ను రూ.9.25 కోట్లు పెట్టి   చెన్నై సూపర్ కింగ్స్ కొనుగోలు చేసింది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button