News
IPL 2020:CSKటీమ్ కి మరో షాక్ ….

తాజాగా CSKటీంకు మరో ఎదురుదెబ్బ తగిలింది. హర్భజన్ సింగ్ కూడా రైనా లాగే వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ నుంచి తప్పుకున్నట్టు ప్రకటించాడు.
ఈ నిర్ణయాన్ని జట్టుకు తెలిపినట్టు పేర్కొన్నాడు. కొద్దిరోజులుగా తన తల్లి అనారోగ్యంతో బాధపడుతున్నారని.అందువలనే తను టీమ్ లో ఆడటం లేదని తెలిపాడు.
ఇప్పుడు హార్భజన్ సింగ్ స్థానాన్ని భర్తీ చేసే స్పిన్నర్ కోసం చెన్నై సూపర్ కింగ్స్ వెతుకుతుంది.
భజ్జీ స్థానాన్ని ఇమ్రాన్ తాహిర్ భర్తీ చేస్తాడని భావిస్తున్నారు, సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ జరగనుండగా.. ఆగస్టు 20న యూఏఈకి చెన్నై సూపర్ కింగ్ చేరుకుంది.
అయితే జట్టుతో కలిసి కాకుండా తాను మాత్రం సెప్టెంబర్ 1 నాటికి యూఏఈకి వస్తానని హార్భజన్ తెలిపాడు.