iPhone Benefits: ఐ-ఫోన్ కొంటే కలిగే లాభాలేంటి?
iPhone Benefits : ఈ రోజుల్లో ఐఫోన్ కొనే వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. గతంలో ఐఫోన్ వందలో ఒక్కరికో ఇద్దరికో ఉండేది.. కానీ ఇప్పుడు వందలో 40-50 వరకు వాడుతున్నారు. మార్కెట్లో చీప్ గా దొరుకుతున్న ఆండ్రాయిడ్ ఫోన్లో వదిలిపెట్టి ఐఫోన్ ఎందుకు కొంటున్నారు అని చాలామందికి డౌట్ వచ్చి ఉంటుంది. ఐఫోన్ కొంటే కలిగే ఐదు లాభాల గురించి తెలుసుకుందాం..

1. లైఫ్ ఈజీగా ఉంటుంది.
చాలామంది ఐఫోన్ వాడడం చాలా కష్టమని అనుకుంటారు. కానీ అందులో ఎంత మాత్రం నిజం లేదు. అందులో షార్ట్ కట్స్ అనే యాప్ తెలిస్తే యాప్ వాడకం చాలా ఈజీగా ఉంటుంది. ఎలా అంటే మనం ఆండ్రాయిడ్ ఫోన్స్ లో అయితే బర్త్డే విషెస్ చెప్పాలంటే 12 కి అల్లారం పెట్టుకుని లేవాలి అదే ఐఫోన్ లో అయితే డైరెక్ట్ గా బర్త్డే విషెస్ ని షెడ్యూల్ చేసి పెడితే చాలు.. ఇలా ఒక్కటేంటి ఈ ఫోన్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి.
2. సెక్యూరిటీ.
ఈ ఫోన్లో ఉన్నంత సెక్యూరిటీ ఏ ఫోన్లో ఉండదు. ఈ ఫోన్ లను హ్యాక్ చేయడం ఎవరి తరం కాదు. అందులో ఏ యాప్ ఇన్స్టాల్ చేయాలన్నా … ఏ యాప్ ఓపెన్ చెయ్యాలన్న ఫీస్ లాక్ ఉంటుంది.
3.సాఫ్ట్వేర్ అప్డేట్స్.
ఐఫోన్ లో అప్డేట్స్ ట్రెండ్ కు తగ్గట్టు వస్తూనే ఉంటాయి. సుమారు 7 నుండి 10 సంవత్సరాల వరకు అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. అదేఆండ్రాయిడ్ ఫోన్లైతే 2-3 సంవత్సరాలు మాత్రమే వస్తూ ఉంటాయి.
4.గేమింగ్.
ఐఫోన్ అనేది గేమ్స్ ఆడే వారికి అద్భుతంగా పనిచేస్తుంది. చాలామంది ప్రొఫెషనల్స్ కూడా ఐ ఫోన్స్ లోనే గేమ్స్ ఆడుతూ ఉంటారు.
5. కెమెరా
కెమెరా క్లారిటీ గురించి తెలిసిందే ..ఐఫోన్ లో ఫ్రంట్ కెమెరా, బ్యాక్ కెమెరా బాగుంటుంది.