technology information

iPhone: ఇక త్వరలో ఈ మోడల్ ఫోన్ల తయారీని ఆపేయనున్న ఆపిల్ సంస్థ…కారణం ఇదేనట !

iPhone

కొత్త కంపెనీల స్మార్ట్ ఫోన్లు ఎన్ని వస్తున్నా, ఆపిల్ ఐఫోన్ కు ఉన్న క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకనే  iPhone సంస్థ నుండి  కొత్త మోడల్ రిలీజ్ అయితే చాలు ఆపిల్ ప్రేమికులు స్టోర్స్ ముందు బారులు తీరుతారు.  అయితే అంత  క్రేజ్ ఉన్న ఈ సంస్థ నుంచి విడుదలైన iPhone 12 mini మాత్రం వినియోగదారులను మాత్రం ఆకట్టుకోలేదు. అందువల్లే ఆ మోడల్ యొక్క  డిమాండ్ దారుణంగా పడిపోయింది.

దీనికి గల కారణం డిస్ప్లే చిన్నదిగా ఉండడంతో పాటు, బ్యాటరీ లైఫ్ కూడా తక్కువగా ఉంటుంది. iPhone 12 mini ప్రస్తుత ధర రూ. 65,000 పైనే ఉంది. ఈ  ఫోన్ ల  తయారీ నిలిచిపోయిన ,కొంతకాలం  మార్కెట్లో  అందుబాటులో ఉంటాయి.

దీంతో సంస్థ ఈ మోడల్ తయారీని త్వరలో ఆపివేయనుంది. ఈ విషయాన్నీ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ మధ్యన  విడుదలైన  iPhone 12, iPhone 12 Pro, iPhone 12 Pro Max మాత్రం మంచి ఆదరణ తెచ్చుకున్నాయి. వీటి అమ్మకాలు విపరీతంగా పెరుగుతున్నాయి.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button