Today Telugu News Updates

intermediate board exam schedule : పరీక్షల షెడ్యూల్ విడుదల చేసిన ఇంటర్మీడియేట్ బోర్డు !

intermediate board exam schedule

intermediate board exam schedule : తెలంగాణలో ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. ఈ సంవత్సరం  మే 1 నుండి 19 వరకు ఇంటర్ మొద‌టి సంవ‌త్స‌రం, అలాగే  మే 2 నుండి  20 వరకు ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు ఉంటాయని తెలంగాణ  ఇంట‌ర్మీడియేట్ బోర్డు తెలిపింది. ఈ పరీక్షలు ఉదయం 9గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు ఉండనున్నాయి. 

అదేవిదంగా ఏప్రిల్‌ 1న ఎథిక్స్ అండ్ హ్యూమన్ వ్యాల్యూస్.. ఏప్రిల్‌ 3న ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ పరీక్షలు జరగనున్నాయి. ఈ విషయాన్నీ  ఇంట‌ర్మీడియేట్ బోర్డు ప్ర‌క‌టించింది. ఇక ఇంట‌ర్ సెకండియ‌ర్ విద్యార్థులకు క్లాసుల‌తో పాటే ప్రాక్టికల్స్ కూడా‌ జరపాలని ఇదివరకే  ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది. 

మ‌రోవైపు ఉదయం 9 నుండి  సాయంత్రం 4 గంటల వరకు కాలేజీలను నిర్వహించాలని, అదేవిదంగా ఇటీవల ప్ర‌భుత్వం….ఒక రోజు ఫస్టియర్ విద్యార్థుల‌కు ‌, రెండోరోజు సెకండియర్ విద్యార్థుల‌కు క్లాసులు జరపాలని సూచించింది.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button