Tollywood news in telugu

Gatham : అరుదైన అవకాశాన్ని దక్కించుకున్న ‘గతం ‘ మూవీ !

gatham movie

IFFI లోని ఇండియన్ మనోరమ కేటగిరిలో చోటుదక్కిన్చుకున్న సినిమాగా ‘గతం ‘ మూవీ నిలిచింది. ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో(IFFI) , ఇండియన్ మనోరమ ఒక ప్రధాన భాగం అని అందరికి తెలిసిన విషయమే, ఇందులో బెస్ట్ ఇండియన్ సినిమాలను  ప్రదర్శిస్తూ ఉంటారు.IFFI ని 1978లో స్టార్ట్ చేసారు. 

గత నెల నవంబర్ 6న ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలై హిట్టు కొట్టింది. ఈ సినిమాని కిరణ్ కొండమడుగుల త్రిల్లర్ సినిమాగా తెరకేక్కిన్చారు. సృజన్ యర్రబోలు, భార్గవ పోలుదాసు,  హర్ష వర్ధన్ ప్రతాప్‌లు కలిసి ఈ సినిమాను అద్భుతంగా నిర్మించారు.

ఈ సినిమా ఇపుడు జనవరి 17 న గోవాలో జరగబోయే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(IFFI) మనోరమ కేటగిరిలో ప్రదర్శితం కానుంది. ఇంతటి అరుదైన గొప్ప అవకాశాన్ని దక్కించుకున్నందుకు ‘గతం ‘ సినిమా యూనిట్ సంతోషం వ్యక్తం చేసింది.

Read  check pre release photos : సందడి చేస్తున్న 'చెక్' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోస్..!
Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button