sports news in telugu

India vs England: తొలి ఇన్నింగ్స్ లో 337 పరుగులకు గాను టీమ్ ఇండియా ఆలౌట్…!

India vs England  Live Score

India vs England  Live Score: చెన్నై లో ఇండియా కి ఇంగ్లాండ్ మధ్య  జరుగుతున్న   తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 337 పరుగులు పెట్టి ఆలౌటైంది. ఓవర్‌నైట్‌ స్కోర్‌ 257/6తో సోమవారం నాలుగో రోజు ఆట మొదలుపెట్టిన ఇండియా ముందుగా  రవిచంద్రన్ అశ్విన్ వికెట్ కోల్పోయారు.  వాషింగ్టన్‌ సుందర్‌ ఒంటరి గా పోరాడగా  తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా  337 పరుగులకు ఆలౌటైంది. అందువల్ల  ఇంగ్లాండ్‌కు 241 పరుగుల ఇన్నింగ్స్ ఆధిక్యం చేకూరింది. 

ఇంగ్లాండ్ బౌలర్ లీచ్ విసిరినా బాల్ ని  అశ్విన్ డిఫెన్స్ ఆడగా గ్లోవ్స్‌కు తాకి అక్కడే లేచి ఫస్ట్ స్లిప్‌లో ఉన్న బెన్ స్టోక్స్ అందుకునే సమయానికి   ఇంగ్లాండ్ కీపర్ జాస్ బట్లర్ డైవ్ చేసి  అందుకోవడంతో , టీమిండియా ఆల్ రౌండర్ అశ్విన్ నిరాశతో వెనకడుగు వేసాడు. దీని వల్ల  వాషింగ్టన్ సుందర్, అశ్విన్ 80 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆపై లీచ్,  షాబాద్ నదీమ్ ను  ఔట్ చేసి షాక్ ఇచ్చారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button