India vs England 3rd Test : మూడో టెస్టులో ఘన విజయం సాధించిన టీమిండియా ..!

India vs England 3rd Test : మొతేరా లో ఇండియా – ఇంగ్లాండ్ కు మధ్య సరుగుతున్న మూడో టెస్టులో భారత్ 10 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 49 పరుగుల తేడాతో నాలుగో ఇన్నింగ్స్ బ్యాటింగ్ మొదలుపెట్టిన ఇండియా .. రోహిత్ , గిల్ రాణించడంతో 7.4 ఓవర్లలోనే విజయం కైవసం చేసుకుంది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 112 రన్స్ కె ఆలౌటయ్యింది. 99/3తో రెండో రోజు ఆట మొదలుపెట్టిన ఇండియా రూట్, లీచ్ విజృంభణతో 145 పరుగులకే కుప్పకూలింది.
రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్‌కు అక్షర్ పటేల్, అశ్విన్ చుక్కలు కనపడేలా చేశారు. అక్షర్ తొలి బంతికే వికెట్ తీసి ప్రత్యర్థి జట్టును గట్టి పోటీ ఇచ్చారు. మొదటి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు పడగొట్టిన అక్షర్ .. రెండవ ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 3 వికెట్లు తీసిన అశ్విన్ రెండవ ఇన్నింగ్స్‌లో 4 వికెట్లు పడగొట్టాడు. ఈ సందర్భంలో అశ్విన్ టెస్టుల్లో 400 వికెట్లను తన ఖాతాలో జమచేసుకున్నాడు.
భారత స్పిన్నర్లు రెచ్చిపోవడంతో 81 పరుగులకే ఇంగ్లాండ్ జట్టు ఆలౌటయ్యింది. మొదటి ఇన్నింగ్స్‌లో 33 పరుగుల ఆధిక్యంలో ఉండగా.. భారత్ 49 పరుగుల లక్ష్యాన్ని తేలికగా చేరుకుంది. ఈ ఘనవిజయం తో టెస్టు సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో భారత్ ఉంది. ఇక మిగిలిన లాస్ట్ పోరు మార్చి 4 నుంచి మొదలుకానుంది.