sports news in telugu
India Vs England 2021: రెండో టెస్టుకు ముందు టీమిండియాలో కొన్ని మార్పులు …!

India Vs England 2021: భారత్ తొలి టెస్టు ఓడిపోయిన,రెండో టెస్ట్ లో ఎలాగైనా గెలవాలని కసితో ఉంది. ఈ సందర్భంలో తుది జట్టులో ని కొన్ని మార్పులతో బరిలోకి దిగనుంది. తొలి టెస్టులో విఫలమైన నదీమ్‌ను పక్కన పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి.
ఇదిలా ఉంటె గాయం కారణంగా మొదటి టెస్ట్ కు దూరమైన అక్షర్ పటేల్ అతడి స్థానంలో రానున్నాడు. ఇక కుల్దీప్ యాదవ్‌ను కూడా రెండవ జట్టులోకి తీసుకునే అవకాశం ఉండగా.. ఎవరిపై వేటు పడనుందో తేలబోతుంది. అదేవిదంగా బ్యాటింగ్ టీమ్ లో కొన్ని మార్పులు చేర్పులు ఉండనున్నాయని సమాచారం ఇంకా దీనిపై క్లారిటీ రావలసి ఉంది.
ఇక మొదటి టెస్టులో ఇంగ్లాండ్ పై టీమిండియా ఓడిపోయినా విషయం తెలిసిందే. 227 పరుగుల తేడాతో ఘోర ఓటమిని పాలైంది. కెప్టెన్ విరాట్ కోహ్లీ(72), గిల్(50) తప్పితే మిగిలినవారు ఎవరూ పెద్దగా స్కోర్లు చేయలేకపోయారు.