India vs England 2021 Schedule: పూర్తి షెడ్యూల్ ఇదే!

India vs England 2021 Schedule: ఇటీవలే ఆసీస్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ సిరీస్ లో భారత్ చరిత్రాత్మక విజయాన్ని అందుకుంది. ఈ మేరకు మంచి ఫామ్లో ఉన్న ఇండియన్ ఆటగాళ్లు ఇంగ్లాండ్తో జరుగనున్న మూడు ఫార్మెట్లో కోసం సన్నద్ధం అవుతున్నారు.ఇండియా ఇంగ్లాండ్ తో 4 టెస్టులు, 5 టి20లు, 3వన్డే లో తలపడునున్నాయి..
ఈ సిరీస్ ఫిబ్రవరి 5 నుంచి మొదలవుతుంది. ఈ అన్ని మ్యాచులు చెన్నై, అహ్మదాబాద్ పూణే వేదికగా జరుగుతున్నాయి. ఇంగ్లాండ్ సిరీస్ కి ఆస్ట్రేలియా మొదటి టెస్టు ఆడి ఆ తర్వాత పితృత్వ సెలవు తీసుకున్న విరాట్ కోహ్లీ మళ్లీ యధావిధిగా టీమిండియా సారథిగా వ్యవహరిస్తున్నాడు. అలాగే ఇషాంత్ శర్మ ,హార్దిక్ పాండ్యా కూడా ఈ 3 ఫార్మెట్ లో అడునున్నారు.
ఈ సిరీస్ లో యువ క్రికెటర్లు రిషబ్ పంత్, శుభమన్ గిల్, మహమ్మద్ సిరాజ్, శార్దుల్ ఠాకూర్,వాషింగ్టన్ సుందర్ కూడా ఆడుతున్నారు
మొత్తం ఇండియా Vs ఇంగ్లాండ్ మ్యాచ్ ల షెడ్యూల్:
4 టెస్ట్ మ్యాచ్లు: ఫిబ్రవరి 5 నుండి మార్చి 8 వరకు కొనసాగుతాయి
1st టెస్ట్: ఫిబ్రవరి 5- 9
సమయం: 9:30AM
వేదిక:- చెన్నై
2nd టెస్ట్: ఫిబ్రవరి 13-17
సమయం: 9:30AM
వేదిక: చెన్నై
3rd టెస్ట్: ఫిబ్రవరి 24-28
సమయం: 2:30PM
వేదిక: అహ్మదాబాద్
4th టెస్ట్: మార్చి 4-8
సమయం: 9:30PM
వేదిక: అహ్మదాబాద్
5 టి20 మ్యాచ్లు:
ఈ మ్యాచ్ లన్నీ అహ్మదాబాద్లో రాత్రి ఏడు గంటలకు జరుగునున్నాయి
1st టీ20:- మార్చి 12
2nd టీ20:- మార్చి 14
3rd టీ20:- మార్చి 16
4th టీ20:- మార్చి 18
5th టీ20:- మార్చి 20
3 వన్డే మ్యాచ్ల్:-
ఈ మూడు వన్డే మ్యాచ్లో పూణే వేదికగా మధ్యాహ్నం 1:30 గంటలకు జరుగనున్నాయి
1st వన్డే:- మార్చి 23
2nd వన్డే:- మార్చి 26
3rd వన్డే:- మార్చి 28