Lemons: నిమ్మ జ్యూస్.. ఆరోగ్యానికి భేష్..
Health Benefits of Lemons: నిమ్మకాయల అద్భుతమైన సౌందర్య రహస్యం ఇమిడి ఉంది. ఇది ముఖాన్ని కాంతివంతంగా మారుస్తుంది. ఇందులో విటమిన్ సి, బీ, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.
ప్రతిరోజూ లెమన్‌ను మోచేయి మరియు మోకాళ్లకు రుద్దటం ద్వారా అక్కడ ఏర్పడిన నల్లధనం పోయి మెరుపును సంతరించుకుంటాయి.
లెమన్ జ్యూస్‌లో దూదిని ముంచి ఆ రసాన్ని కంటి కింద మరియు ముఖానికి మసాజ్‌లా రాయడం వల్ల ముఖంపై నల్లటి మచ్చలు, కంటి కింద నల్లటి వలయాలు తగ్గుతాయి.

లెమన్ జ్యూస్, బేకింగ్ సోడా లేది ఉప్పును కలిపి పళ్లను తోమడం ద్వారా పళ్లను మిలమిలలాడేలా చేసుకోవచ్చు.
ప్రతిరోజూ గోరువెచ్చని నీటితో పాటు లెమన్ జ్యూస్‌ను కలిపి తీసుకోవడం అలవాటుగా చేసుకుంటే రోజంతా హుషారుగా ఉండవచ్చు. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
బరువు తగ్గాలనుకునే వారికి లెమన్ జ్యూస్ ఒక అద్భుత వరం. ఇది ఎన్నో పోషక విలువలను కలిగి ఉంది.