health tips in telugu
Ginger: అల్లంతో అద్భుత ప్రయోజనాలు.. మీకోసమే..
ఆహారానికి రుచిని ఇవ్వడమే కాకుండా ఆరోగ్య పంరగానూ అల్లం మనకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇందులో అనేక పోషక విలువలతో పాటు విటమిన్ సి, విటమిన్ ఇ, మాంగనీస్, ఐరన్, మెగ్నీషియం ఉంటాయి. ఇప్పుడు అల్లం ఉపయోగాలను పరిశీలిస్తే..
అల్లం నోటి దుర్వాసనను పోగొడుతుంది. నోటిలో చేరిన ప్రమాదకర బ్యాక్టీరియాను సంహరించి, దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
అల్లానికి కొలెస్ట్రాల్‌ను తగ్గించే గుణం ఉంది. అధిక బరువును తగ్గించడంలో ఉపయోగపడుతుంది. రక్తనాళాలలను శుభ్రం చేస్తుంది. శరీరంలోని రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది.

అల్లం జీర్ణశక్తిని పెంచుతుంది. జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. కేన్సర్ కారకాలతో పోరాడుతుంది.
అల్లాన్ని తీసుకోవడం ద్వారా తరచుగా వచ్చే జలుబు, దగ్గులను నివారించుకోవచ్చు. శ్వాసకు సంబంధించిన సమస్యలను తగ్గిస్తుంది.