telugu gods devotional information in telugu

తెలుసా ఎందుకో! ముచ్చటగా మూడు రోజులు జరుపుకొనే సంక్రాంతి పండగ!!!

Importance and significance of three days Sankranti festival in telugu

sankranti festival in telugu :: మన తెలుగు ప్రజలు మకర రాశిలో సూర్యడు ప్రవేశిస్తున్న సమయాన్ని పరిగణలోకి తీసుకొని ముచ్చటగా మూడు రోజులు జరుపుకొనే పండగలు ‘భోగి ”సంక్రాంతి”కనుమ’ ఈ మూడు పండగలను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.

  1. భోగ భాగ్యాలను మన దరికి చేర్చే”భోగి”
Bhogi
Bhogi

ఈ భోగి పండగ సంక్రాంతికి ఒకరోజు ముందుగా భోగి మంటలు వేస్తూ, ఈ మంటలలో మన ఇంట్లో ఉండే పనికి రాని వస్తువులను, మనలో ఉండే అశ్రద్దను,బద్దకాన్ని,చెడు ఆలోచనలను భోగి మంటలలో వేస్తూ రేపటినుండి మనకు మంచిరోజులు రావాలని ఆ దేవున్ని కోరుకొంటూ,ఎంతో భక్తిశ్రద్దలతో ప్రతి ఇంటి ముందర  భోగిమంటలు వేసుకుంటారు.

అలాగే పాడి పంటలను ఇంటికి తెచ్చుకొని మన ఇల్లు ధాన్య సంపదతో సంతొషంగా ఉంటుంది. పల్లెల్లోని అన్ని కడపలు పచ్చని బోట్లతో, ఆకు పచ్చని తోరణాలతో ఊరంతా ముస్తాబు అవుతుంది . ఈ రోజులాగే అన్ని రోజులు ఉండాలని భోగి రోజు ఉదయాన్నే లేచి తల స్నానాలు చేసి, భగవత్ సన్నిధిలో పూజలు చేస్తాము. 

2. సంక్రాంతి రోజు పాటించవలసినవి – Know about sankranti festival in telugu

Know about makara sankranti festival in telugu
makarasankrathi

ఈ రోజునాడు ప్రతి ఒక్కరు ఉదయాన్నే నిద్రలేచి,పరిసరాలు శుభ్రం చేసుకొని, తలస్నానాలు ఆచరించితెలంగాణ, ఆంధ్ర అని తేడాలు లేకుండా మన ఈ రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతి ఇంటి ముందు మామిడి తోరణాలు, పూల తోరణాలు వరి ధాన్యాల కుప్పలు, పిండి వంటలతో, పెద్ద పెద్ద ముగ్గులు, ఆ ఊరికి, వాడకి, పల్లెపల్లెకు ఎంతో అందంగా ఆనందంగా ఈ సంక్రాంతి పండగను ఘనంగా జరుపుకుంటారు.

3. కనుమరోజు చేసే విధులు

Kanuma
Kanuma

కనుమ అంటే పాడి పశువములను పూజించే రోజు, ఈ రోజునాడు పశువుల కొట్టాలను, పశువులను, శుభ్రముగా కడిగి పశువుల కొమ్ములకు రంగులు వేస్తారు,మేడలో దండాలతో  అందంగా అలంకరించి,గోవును పూజిస్తారు.

ఆంధ్ర ప్రాంతంలో కోళ్ల పందాలు,ఎడ్ల పందాలు కాస్తూ ప్రజలు ఎంతో ఆనందంగా ఈ మూడు రోజులు పండగని జరుపుకుంటారు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button