Real life stories

రోడ్డు పక్కన బిచ్చమెత్తుకుంటున్న ఐఐటి ఇంజనీర్ !

engineer begging story

దేశం లో ఒక ప్రతిష్టాత్మకమైన ఐఐటీ కాన్‌పూర్‌లో ఇంజినీరింగ్ విద్య చదివిన ఓక  వ్యక్తి రోడ్డు పక్కన బిక్షాటన చేస్తున్నాడు.  ఈ దారుణమైన ఘటన మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగింది.  సురేంద్ర వశిష్ట్‌ అనే 90 ఏళ్ల కు దగ్గరగా ఉన్న వ్యక్తి దిక్కులేని పరిస్తుతులలో  రోడ్డు పక్కన అడుక్కు తింటున్నాడు. 

సురేంద్రను, ఆశ్రయం స్వర్గ్ సదన్‌కు చెందిన ఒక ప్రతినిధి చూసి ఆగి ఆ వ్యక్తితో  మాట్లాడాడు. తన మాటల్లో సురేంద్ర ఇంగ్లీష్ అనర్గళంగా రావడం చూసి  సదన్ ప్రతినిధి ఆశ్చర్యపోయాడు. ఆ ప్రతినిధి  అతని గురించి పూర్తి వివరాలు అడగగా.. తాను 1969 సంవత్సరంలో లో ఐఐటి-కాన్పూర్ నుంచి మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశానని తెలిపాడు .

 అదేకాకుండా  1972 సంవత్సరంలో  లక్నో నుంచి ఎల్ఎల్ఎం కూడా చదివానని చెప్పాడు. అతని  తండ్రి 1990లో ప్రస్తుతం మూసివేయబడిన జేసీ మిల్లులో పనిచేసేవాడని సురేంద్ర వెల్లడించాడు.  ఈ విషయాలన్నీ విన్న తర్వాత సదన్ ప్రతినిధి అవోద్వేగానికి లోనై  ఒక ఇంజనీర్ ఇలా రోడ్డుపై అడుక్కోవడమేంటని అనుకోని వెంటనే  సురేంద్రను , ఆ ప్రతినిధి తమ ఆశ్రమానికి తెలుసుకెళ్లిపోయాడు.

Tags

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button